BREAKING
thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం
Date of Publish : 16 October 2026, 07:26 pm
Posted by : MUSUGU GOPI

నవంబర్ 1 నుంచి కాలర్ పేరు చూపించే సేవ అమలు

జాతీయం అంతర్జాతీయం
Reporter
Musugu Gopi Bellamkonda Mandal
16 Oct, 2026 - 07:26 PM
4 వీక్షణలు

4G, 5G నెట్‌వర్క్‌లలో CNAP సేవకు కేంద్ర టెలికాం శాఖ ఆదేశాలు

న్యూఢిల్లీ (ఎన్ టుడే న్యూస్): తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026 నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా 4G, 5G తదితర ఉన్నత తరం వైర్‌లెస్ నెట్‌వర్క్‌లలో కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ (CNAP) సేవను అమలు చేయాలని టెలికమ్యూనికేషన్స్ శాఖ టెలికాం సంస్థలను ఆదేశించింది.

ఈ సేవ ద్వారా ఫోన్‌కు కాల్ వచ్చినప్పుడు నంబర్‌తో పాటు, కాలర్‌ టెలికాం సంస్థ రికార్డుల్లో ఉన్న పేరు కూడా కనిపిస్తుంది. వినియోగదారులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ సేవను అందించాలని శాఖ సూచించింది.

ఫోన్‌లో నంబర్ ఇప్పటికే సేవ్ చేసి ఉంటే, కాంటాక్ట్స్‌లో ఉన్న పేరుకే ప్రాధాన్యం ఉంటుంది. సేవ్ చేయని దేశీయ నంబర్లకు టెలికాం సంస్థ రికార్డుల్లో ఉన్న కాలర్ పేరు చూపిస్తారు. సేవ్ చేయని అంతర్జాతీయ కాల్స్‌కు “International Call” అని కనిపించే విధానం ఉంటుంది.

ఈ సేవ కాలర్‌ను గుర్తించడంలో సహాయపడటంతో పాటు, స్పామ్ కాల్స్‌ను గుర్తించడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అయితే, స్పామ్ లేదా మోசపూరిత కాల్స్ అన్నింటినీ పూర్తిగా అడ్డుకుంటుందని చెప్పలేం. 2G, 3G నెట్‌వర్క్‌లు, ల్యాండ్‌లైన్‌లలో ఈ సేవ అమలుపై తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు.