ఫుడ్ డెలివరీ ముసుగులో గంజాయి సప్లై...ఇద్దరి అరెస్ట్
ఫుడ్ డెలివరీ ముసుగులో గంజాయి సప్లై...ఇద్దరి అరెస్ట్
ఫుడ్ డెలివరీ బ్యాగుల ముసుగులో గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరిని మహేశ్వరం ఎస్‌ఓటీ, మంచాల పోలీసులు సంయుక్త ఆపరేషన్‌లో అరెస్ట్ చేశారు. వారి నుంచి 1.1 కిలోల గంజాయి, బైక్, డిజిటల్ వేయింగ్ మెషిన్, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. విజయవాడ కేంద్రంగా గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకొస్తున్నట్లు సమాచారం. నిఘా నుంచి తప్పించుకునేందుకు స్విగ్గీ డెలివరీ సిబ్బంది తరహాలో బ్యాగులు ఉపయోగిస్తూ, పరిచయమున్న వినియోగదారులకు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది.
గంజాయిని తూకం వేసి చిన్న ప్యాకెట్లుగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రధాన సరఫరాదారుగా పేర్కొంటున్న ప్రదీప్ కోసం గాలింపు కొనసాగుతోంది. మంచాల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, ఇతరుల ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నార