మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కూలిన సీలింగ్.. తప్పిన పెను ప్రమాదం
తెలంగాణ
/
మహబూబాబాద్
మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కూలిన సీలింగ్.. తప్పిన పెను ప్రమాదం
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పీడియాట్రిక్ కేర్ యూనిట్‌కు వెళ్లే కారిడార్‌లో సీలింగ్ ఊడిపడింది. ఘటన జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని, సిబ్బందితో కారిడార్‌లోని సీలింగ్‌ను తొలగించారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది, రోగులు ఊపిరిపీల్చుకున్నారు.
ఆసుపత్రి భవనంలోని మరికొన్ని చోట్ల కూడా పెచ్చులు ఊడిపోయే పరిస్థితి కనిపిస్తుండటంతో రోగులు, వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిరోజూ అనేక మంది రాకపోకలు సాగించే ఆసుపత్రిలో భవన భద్రతపై అధికారులు దృష్టి సారించాలని, ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి తక్షణ మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.