చాట్రాయి ఎంపీటీసీ అభ్యర్థిగా బీజేపీ నేత ద్రోణంరాజు శ్రీనివాసరావు ఏకగ్రీవ ఎంపిక
ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలంలోని స్థానిక చాట్రాయి ఎంపీటీసీ అభ్యర్థిగా బీజేపీకి చెందిన ద్రోణంరాజు శ్రీనివాసరావును ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ మేరకు ఆయన అభ్యర్థిత్వానికి సంబంధించి ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ద్రోణంరాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఎంపీటీసీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా తీర్మానించిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, తనకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, ప్రజల అవసరాలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజాసేవకు అంకితభావంతో పనిచేస్తానని అన్నారు.