BREAKING
thumb ● తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పోగుల సుతేజ్ thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ thumb ● ఉరుమడ్లలో 180 మంది వృద్ధులకు నూతన వస్త్రాల పంపిణీ thumb ● చెడుపై మంచి విజయానికి ప్రతీక.. దసరా పండుగ విశిష్టత thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పోగుల సుతేజ్ thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ thumb ● ఉరుమడ్లలో 180 మంది వృద్ధులకు నూతన వస్త్రాల పంపిణీ thumb ● చెడుపై మంచి విజయానికి ప్రతీక.. దసరా పండుగ విశిష్టత thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం
Date of Publish : 21 October 2026, 01:18 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి ఎంపీటీసీ అభ్యర్థిగా బీజేపీ నేత ద్రోణంరాజు శ్రీనివాసరావు నామినేషన్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Oct, 2026 - 01:18 PM
42 వీక్షణలు

చాట్రాయి, ఏలూరు జిల్లా: నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల ఎంపీటీసీ అభ్యర్థిగా బీజేపీ నేత ద్రోణంరాజు శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆయన నామినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఓబిళ్ళనేని ఉదయ రాజేశ్వరరావు, బుర్రి శ్రీకర్, మేకపోతుల వెంకటేశ్వరరావు, చాగంటి వాసుదేవరావు, ఇజ్జిగిరి కేశవ నరసింహ,  గడ్డం సంజీవరెడ్డి, ఆదిమూలం నాగమోహన శర్మ, కనమతరెడ్డి ముత్తారెడ్డి, నెక్కళ్ళపు వెంకటేశ్వరరావు, కూరపాటి బాబ్జితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ద్రోణంరాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ చాట్రాయి గ్రామ అభివృద్ధికి కృషి చేయడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, తాగునీరు, పారిశుధ్యం, రహదారుల వంటి ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి, వారి అభిప్రాయాలకు ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తానని చెప్పారు.

ఎంపీటీసీగా అవకాశం కల్పిస్తే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ ముందుకు సాగుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు.