BREAKING
thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
Date of Publish : 15 October 2026, 02:57 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి జడ్పీటీసీ అభ్యర్థిగా నక్కా రాముకు అవకాశం కల్పించాలి!

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Oct, 2026 - 02:57 PM
82 వీక్షణలు

33 ఏళ్లుగా టీడీపీకి సేవలు.. సామాజిక సేవలోనూ ప్రత్యేక గుర్తింపు

చాట్రాయి: చాట్రాయి మండల జడ్పీటీసీ స్థానం ఎస్సీ జనరల్‌కు కేటాయించిన నేపథ్యంలో, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నక్కా రాముకు అభ్యర్థిగా అవకాశం కల్పించాలని ఆయన కోరుతున్నారు. గత 33 ఏళ్లుగా పార్టీ కార్యకర్తగా కొనసాగుతూ, వివిధ హోదాల్లో సేవలందించిన తనకు పార్టీ నాయకత్వం తగిన గుర్తింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

నక్కా రాము చాట్రాయి మండల టీడీపీ ప్రధాన కార్యదర్శిగా, ప్రచార కార్యదర్శిగా వివిధ బాధ్యతలు నిర్వహించారు. మూడు దశాబ్దాలకు పైగా పార్టీ అభివృద్ధికి కృషి చేసిన ఆయనకు మండలంలోని 18 పంచాయతీ గ్రామాల ప్రజలతో పరిచయాలు ఉన్నాయని తెలిపారు.

రాజకీయ కార్యకలాపాలతో పాటు సామాజిక సేవలోనూ నక్కా రాము తనదైన ముద్ర వేశారు. 2001 నుంచి సుమారు 13 ఏళ్ల పాటు తన భార్య మాణిక్యంతో కలిసి CASA స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా బాలికల సంరక్షణ, విద్యావ్యాప్తి కోసం కృషి చేశారు. మండలంలోని మారుమూల గ్రామాల్లో పర్యటిస్తూ, బాలికల సంక్షేమం, విద్య ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగస్వాములయ్యారు.

పార్టీ పట్ల అంకితభావం, 33 ఏళ్ల రాజకీయ అనుభవం, సంస్థాగత బాధ్యతల నిర్వహణ, సామాజిక సేవలో పాల్గొన్న నేపథ్యం తనకు అనుకూలంగా ఉంటాయని నక్కా రాము ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని జడ్పీటీసీ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరుతున్నారు.

దీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్ నాయకుడికి అవకాశం కల్పించాలని ఆయన మద్దతుదారులు సైతం అభిప్రాయపడుతున్నారు. పార్టీ నాయకత్వం నక్కా రాము సేవలను గుర్తించి, జడ్పీటీసీ అభ్యర్థిత్వంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.