చీపురుగూడెంలో టీడీపీలోకి వైసీపీకి చెందిన 42 కుటుంబాలు చేరిక
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చీపురుగూడెం గ్రామంలో వైఎస్సార్‌సీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు రావి లక్ష్మీనారాయణ, రావి రమేష్ ఆధ్వర్యంలో 42 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ చేరిక కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు, క్లస్టర్ ఇన్‌చార్జి దిలీప్ కుమార్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు బొట్టు వరలక్ష్మి, బొట్టు రామచంద్ర రావు, మందలపు జగదీష్, బొట్టు లక్ష్మణరావు, సహకార సంఘం అధ్యక్షుడు గుండ్రు కుటుంబరావు, వీరాస్వామి, భలే స్వామి, బొర్రా శ్రీనివాసరావు, బొర్రా పెద్దన్న, తమ్మిశెట్టి తనగల, బొట్టు పవన్ కుమార్, మన్మధరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి నాయకత్వంపై నమ్మకంతోనే తాము తెలుగుదేశం పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. గ్రామంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.