BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● మృతుడి కుటుంబానికి రూ.82 వేల ఆర్థిక సాయం thumb ● మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ thumb ● ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్‌చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ బాధ్యతల స్వీకరణ thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● మృతుడి కుటుంబానికి రూ.82 వేల ఆర్థిక సాయం thumb ● మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ thumb ● ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్‌చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ బాధ్యతల స్వీకరణ thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్
Date of Publish : 17 October 2026, 08:29 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పోలవరం టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా చల్లగుళ్ల రాజ్యలక్ష్మి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Oct, 2026 - 08:29 PM
134 వీక్షణలు

ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం పోలవరం ఎంపీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చల్లగుళ్ల రాజ్యలక్ష్మిని ఎంపిక చేశారు. ఈ మేరకు పోలవరం టీడీపీ అధ్యక్షుడు బిలుగుది జయరాజు అధ్యక్షతన గ్రామంలోని హైస్కూల్ సెంటర్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. చల్లగుళ్ల రాజ్యలక్ష్మి అభ్యర్థిత్వాన్ని సమావేశంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా చాట్రాయి టీడీపీ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు మరిడి వెంకటేశ్వరరావు (చిట్టిబాబు) మాట్లాడుతూ, పార్టీలోని విభేదాలను పక్కనపెట్టి అందరూ ఏకతాటిపైకి వచ్చి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పోలవరం ఎంపీటీసీగా చల్లగుళ్ల రాజ్యలక్ష్మి గెలుపు ఆవశ్యకమని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేసి ఆమెను గెలిపించాలని కోరారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.