BREAKING
thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఆకుతోట భావి తండా కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పాండు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● కాంగ్రెస్ మండల కమిటీ నూతన కార్యవర్గానికి సన్మానం thumb ● నిబంధనల ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఆకుతోట భావి తండా కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పాండు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● కాంగ్రెస్ మండల కమిటీ నూతన కార్యవర్గానికి సన్మానం thumb ● నిబంధనల ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
Date of Publish : 19 October 2026, 10:58 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి జడ్పీటీసీ స్థానాన్ని బీజేపీకి కేటాయించాలి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Oct, 2026 - 10:58 PM
9 వీక్షణలు

మంత్రి కొలుసు పార్థసారథిని కలిసిన బీజేపీ నాయకులు.. జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థిత్వాలపై వినతి

ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం: చాట్రాయి మండల జడ్పీటీసీ స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి కేటాయించాలని కోరుతూ బీజేపీ నాయకులు గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథిని కలిశారు. కూటమి పొత్తుల్లో భాగంగా చాట్రాయి జడ్పీటీసీ స్థానాన్ని బీజేపీకి కేటాయించాలని తమ అభిప్రాయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ఏలూరు జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు శ్రీకర్ బుర్రి చాట్రాయి మండల జడ్పీటీసీ అభ్యర్థిగా, ద్రోణం రాజు శ్రీనివాసరావు చాట్రాయి ఎంపీటీసీ అభ్యర్థిగా తమ అభ్యర్థిత్వాలను మంత్రి పార్థసారథికి తెలియజేశారు. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటులో బీజేపీకి తగిన ప్రాధాన్యం కల్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ చాట్రాయి మండల అధ్యక్షుడు ఉదయ రాజేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు చాగంటి వాసుదేవరావు, ఓబీసీ మోర్చా నాయకులు నాగమోహన్ శర్మ, ఇజ్జగిరి కేశవ, పార్టీ సమన్వయకర్త మాటూరి రవికాంత్, సీనియర్ నాయకుడు మేకపోతుల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

అలాగే ముసునూరు, నూజివీడు రూరల్, ఆగిరిపల్లి మండలాల బీజేపీ అధ్యక్షులు సంగా రంగారావు, నక్క నాగశివ, బడుగు శ్రీకాంత్‌తో పాటు నూజివీడు నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాలకు చెందిన బీజేపీ ఎంపీటీసీ ఆశావహులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

కూటమి సీట్ల కేటాయింపుల నేపథ్యంలో చాట్రాయి జడ్పీటీసీ స్థానంపై బీజేపీ నాయకులు తమ అభ్యర్థిత్వాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లడం స్థానిక రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.