సీజేపీ అధ్యక్షుడు అభిజీత్ దీప్కేకు బెయిల్ మంజూరు
తిరంగా మార్చ్‌కు బయల్దేరిన సమయంలో అరెస్ట్.. శాంతి బాండ్‌పై సంతకం చేయాలని కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ (ఎన్ టుడే న్యూస్): సీజేపీ అధ్యక్షుడు అభిజీత్ దీప్కేకు ఢిల్లీలోని న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కనాట్ప్లేస్లో తిరంగా మార్చ్ నిర్వహించేందుకు బయల్దేరిన ఆయనను శుక్రవారం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం శనివారం న్యాయస్థానంలో హాజరుపరిచారు.
కనాట్ప్లేస్లో తిరంగా మార్చ్ నిర్వహించేందుకు అభిజీత్ దీప్కే పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందనే కారణంతో చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
న్యాయస్థానంలో విచారణ అనంతరం అభిజీత్ దీప్కేకు బెయిల్ మంజూరైంది. శాంతిభద్రతలను కాపాడేందుకు సంబంధించిన పీస్ బాండ్‌పై సంతకం చేయాలని కోర్టు ఆదేశించినట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి. బాండ్‌కు సంబంధించిన ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆయనను విడుదల చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.