BREAKING
thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్ thumb ● పులివెందుల పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం thumb ● యామవరం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు thumb ● పులివెందులలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందుల 15వ వార్డుపై అందరి దృష్టి thumb ● తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పోగుల సుతేజ్ thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్ thumb ● పులివెందుల పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం thumb ● యామవరం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు thumb ● పులివెందులలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందుల 15వ వార్డుపై అందరి దృష్టి thumb ● తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పోగుల సుతేజ్ thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్
Date of Publish : 21 October 2026, 02:41 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పోలీసు అమరవీరుల త్యాగాలకు ఘన నివాళి.. మంగళగిరిలో సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Oct, 2026 - 02:41 PM
12 వీక్షణలు

మంగళగిరి: విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల రక్షణ కోసం పోరాడి అమరులైన పోలీసుల సేవలను స్మరించుకుంటూ మంగళగిరిలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. దేశ భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం విధులు నిర్వర్తిస్తూ ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. అనంతరం ‘షహీద్ పుస్తక్ టోలీ – అమరులు వారు’ అనే పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. పోలీసుల త్యాగాలు, సేవలు, విధి నిర్వహణలో వారు ఎదుర్కొనే సవాళ్లను గుర్తుచేసేలా ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సభను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. పోలీసు వ్యవస్థ ప్రజలకు భద్రత కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుండగా, విధి నిర్వహణలో అమరులైన సిబ్బంది త్యాగాలను ఎప్పటికీ మరచిపోలేమనే భావనను ఈ సంస్మరణ కార్యక్రమం చాటిచెప్పింది. ప్రజల రక్షణే లక్ష్యంగా పనిచేసే పోలీసుల సేవలను గౌరవించడం, వారి కుటుంబాలకు అండగా నిలవడం సమాజం బాధ్యతగా నిలుస్తోంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ కార్యక్రమం పోలీసు శాఖలో విధి పట్ల నిబద్ధతను, ప్రజాసేవ పట్ల అంకితభావాన్ని మరోసారి గుర్తుచేసింది

.