BREAKING
thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ thumb ● ఉరుమడ్లలో 180 మంది వృద్ధులకు నూతన వస్త్రాల పంపిణీ thumb ● చెడుపై మంచి విజయానికి ప్రతీక.. దసరా పండుగ విశిష్టత thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ thumb ● ఉరుమడ్లలో 180 మంది వృద్ధులకు నూతన వస్త్రాల పంపిణీ thumb ● చెడుపై మంచి విజయానికి ప్రతీక.. దసరా పండుగ విశిష్టత thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత
Date of Publish : 20 October 2026, 09:33 pm
Posted by : BOYA SWAMY

కొండారెడ్డిపల్లిలో కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో సీఎం రేవంత్ రెడ్డి దసరా వేడుకలు

తెలంగాణ
/ నాగర్ కర్నూల్ / అచంపేట్
Reporter
Boya Swamy Chityala Mandal
20 Oct, 2026 - 09:33 PM
13 వీక్షణలు

కోట మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు.. జమ్మి చెట్టు వద్ద సంప్రదాయబద్ధంగా పూజలు

కొండారెడ్డిపల్లి: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో గ్రామస్థులతో కలిసి విజయదశమి వేడుకల్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజల మధ్య ఆత్మీయంగా గడుపుతూ పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. గ్రామంలోని పెద్దలు, చిన్నారులను పలకరిస్తూ వారితో ముచ్చటించారు. ముఖ్యమంత్రి రాకతో గ్రామంలో పండుగ సందడి మరింత పెరిగింది. గ్రామస్థులు ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు.

సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలోని కోట మైసమ్మ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, గ్రామస్థులతో కలిసి కాలినడకన జమ్మి చెట్టు వద్దకు వెళ్లారు. మార్గమధ్యంలో గ్రామస్థులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. జమ్మి చెట్టు వద్ద సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గ్రామంలో బతుకమ్మ ఆటపాటలు, సంప్రదాయ ఆచారాలు, ఆత్మీయ పలకరింపులతో పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామంలో గడపడం, గ్రామస్థులతో మమేకమై వేడుకల్లో పాల్గొనడం కొండారెడ్డిపల్లిలో దసరా సంబరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

పల్లె సంప్రదాయాలు, కుటుంబ అనుబంధాలు, గ్రామీణ సంస్కృతి ప్రతిబింబించేలా కొండారెడ్డిపల్లిలో విజయదశమి వేడుకలు ఉత్సాహంగా జరిగాయి.