BREAKING
thumb ● ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ శాసనసభాపతి, శాసనమండలి చైర్మన్ thumb ● చండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా పర్సబోయిన నరసింహ thumb ● రెడ్‌క్రాస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు జెస్సు అనిల్ కుమార్‌కు ఘన సన్మానం thumb ● నిరుద్యోగ యువతకు ఏసీ, ఫ్రిడ్జ్ మెకానిక్ కోర్సుల్లో ఉచిత శిక్షణ thumb ● పులివెందులలో వైసీపీకి ఎదురుదెబ్బ.. టీడీపీలో చేరిన అన్వర్ బాషా, ఆయన అనుచరులు thumb ● ఆర్మూర్ జ్యోతిర్లింగ గుడిలో అమావాస్య, పౌర్ణమి రోజుల్లో అన్నదానం thumb ● కోమన్నూతల, చెరోపల్లె గ్రామాల్లో కూటమి అభ్యర్థి ఎన్నికల ప్రచారం thumb ● కార్యకర్తలు అధైర్యపడొద్దు.. వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి thumb ● హైకోర్టులో న్యాయవాదిగా ప్రమాణ స్వీకారం చేసిన పుట్టపాక యువకుడు thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించండి thumb ● ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ శాసనసభాపతి, శాసనమండలి చైర్మన్ thumb ● చండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా పర్సబోయిన నరసింహ thumb ● రెడ్‌క్రాస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు జెస్సు అనిల్ కుమార్‌కు ఘన సన్మానం thumb ● నిరుద్యోగ యువతకు ఏసీ, ఫ్రిడ్జ్ మెకానిక్ కోర్సుల్లో ఉచిత శిక్షణ thumb ● పులివెందులలో వైసీపీకి ఎదురుదెబ్బ.. టీడీపీలో చేరిన అన్వర్ బాషా, ఆయన అనుచరులు thumb ● ఆర్మూర్ జ్యోతిర్లింగ గుడిలో అమావాస్య, పౌర్ణమి రోజుల్లో అన్నదానం thumb ● కోమన్నూతల, చెరోపల్లె గ్రామాల్లో కూటమి అభ్యర్థి ఎన్నికల ప్రచారం thumb ● కార్యకర్తలు అధైర్యపడొద్దు.. వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి thumb ● హైకోర్టులో న్యాయవాదిగా ప్రమాణ స్వీకారం చేసిన పుట్టపాక యువకుడు thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించండి
మంచి మాట
Date of Publish : 26 October 2026, 12:45 pm
Posted by : SHAIK CHAND BASHA

కోమన్నూతల, చెరోపల్లె గ్రామాల్లో కూటమి అభ్యర్థి ఎన్నికల ప్రచారం

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
26 Oct, 2026 - 12:45 PM
18 వీక్షణలు

ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మారెడ్డి భరత్ రెడ్డి

లింగాల (ఎన్ టుడే న్యూస్): లింగాల మండలంలోని కోమన్నూతల, చెరోపల్లె గ్రామాల్లో కూటమి జడ్పీటీసీ అభ్యర్థి యమ్మనూరు సరళ దేవికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పులివెందుల నియోజకవర్గ క్లస్టర్ ఇన్‌చార్జ్ మారెడ్డి భరత్ రెడ్డి, పులివెందుల మండల మాజీ జడ్పీటీసీ మారెడ్డి లత రెడ్డి, లింగాల మండల టీడీపీ అధ్యక్షుడు విశ్వనాథ రెడ్డి సతీమణి, కూటమి జడ్పీటీసీ అభ్యర్థి యమ్మనూరు సరళ దేవి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మారెడ్డి భరత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. పులివెందుల నియోజకవర్గ అభివృద్ధికి బీటెక్ రవి చేస్తున్న కృషిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు.

కోమన్నూతల గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే నాయకత్వం అవసరమని భరత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ, గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.

కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, పులివెందుల నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి సమష్టిగా కృషి చేస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో లింగాల మండల టీడీపీ ఇన్‌చార్జ్ దేవిరెడ్డి సంజీవ రెడ్డి, లింగాల మండల సింగిల్ విండో అధ్యక్షుడు నవీన్ కుమార్ రెడ్డి, జొన్నలగడ్డ ధనుంజయ నాయుడు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.