BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 17 February 2026, 11:30 am
Posted by : NTODAY NEWS OFFICIAL

విస్తృత ఏర్పాట్లకు కలెక్టర్ ఆదేశాలు

తెలంగాణ
17 Feb, 2026 - 11:30 AM
318 వీక్షణలు
ఫిబ్రవరి 18–28 వరకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు: విస్తృత ఏర్పాట్లకు కలెక్టర్ ఆదేశాలు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా ఫిబ్రవరి 18 నుండి 28 వరకు నిర్వహించనున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ చాంబర్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావుతో కలిసి నిర్వహించిన సమన్వయ సమావేశంలో వివిధ శాఖల అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. ముఖ్య ఆదేశాలు: -ఫిబ్రవరి 24న ఎదుర్కోలు మహోత్సవం, 25న కళ్యాణ మహోత్సవం, 26న దివ్య విమాన రథోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. -ప్రతి రోజు భారీ సంఖ్యలో భక్తులు, విఐపీలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రోటోకాల్ ప్రకారం సమగ్ర ఏర్పాట్లు చేయాలి. -ఆలయ పరిసరాల్లో పరిశుభ్రత, శానిటేషన్, తాగునీరు, మరుగుదొడ్లు సమృద్ధిగా ఉండాలి. క్యూలైన్లు సక్రమంగా నిర్వహించేందుకు బారికేడింగ్ ఏర్పాటు చేయాలి. భద్రత మరియు ట్రాఫిక్: -పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్, పార్కింగ్ నియంత్రణ చేపట్టాలి. -ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ ఉండాలి. -ఫైర్ సేఫ్టీ వాహనాలు గుట్టపై, కింద సిద్ధంగా ఉండాలి. మౌలిక సదుపాయాలు: -ఘాట్ రోడ్లలో గుంతలు పూడ్చి, ఫుట్‌పాత్‌ల మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలి. -గుట్టపై, బస్టాండ్ వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలి. -ఆర్టీసీ అదనపు బస్సులు నడపడంతో పాటు షటిల్ సర్వీసులు ఏర్పాటు చేయాలి. -విద్యుత్ అంతరాయం లేకుండా ప్రత్యేక బృందం ఏర్పాటు చేయాలి. -మిషన్ భగీరథ ద్వారా నిరంతర మంచినీటి సరఫరా ఉండాలి. -బ్రహ్మోత్సవాలను భక్తుల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించేందుకు ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. #Yadagirigutta #Brahmotsavam #LakshmiNarasimhaSwamy #TempleFestival #Yadadri #Telangana Follow us on Website Facebook Instagram YouTube