BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 16 October 2026, 07:36 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరులో జబర్దస్త్ కళాకారుల కామెడీ షో.. ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వులు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
16 Oct, 2026 - 07:36 AM
3 వీక్షణలు

చౌడేశ్వరి దేవి ఆలయంలో మూడు గంటలపాటు హాస్య ప్రదర్శనలు

కళాకారులను సత్కరించిన ఆలయ ధర్మకర్త ఎన్. వేణుగోపాల్ రెడ్డి

పుంగనూరు, అన్నమయ్య జిల్లా: జబర్దస్త్ కళాకారుల హాస్య ప్రదర్శనలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం శ్రీ సప్తమాతృక సమేత శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయం వద్ద నిర్వహించిన కామెడీ షో ఆద్యంతం వినోదభరితంగా సాగింది.

మూడు గంటలపాటు హాస్య సందడి

ఆలయ ధర్మకర్త ఎన్. వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జబర్దస్త్ కళాకారులతో ప్రత్యేక హాస్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వినోద్, ఆనంద్, శాంతి స్వరూప్, రాజమౌళి తదితర కళాకారులు వివిధ స్కిట్లు, పంచ్ డైలాగులతో ప్రేక్షకులను అలరించారు. దాదాపు మూడు గంటలపాటు సాగిన ప్రదర్శనలో హాస్య సన్నివేశాలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.

సాధారణంగా టీవీలు, మొబైల్ ఫోన్లలో మాత్రమే చూసే కళాకారుల ప్రదర్శనను ప్రత్యక్షంగా వీక్షించడంతో ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమం ఆద్యంతం నవ్వులు, చప్పట్లతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.

కళాకారులకు సత్కారం

ప్రేక్షకులను అలరించిన కళాకారులు వినోద్, రాజమౌళి, ప్రవీణ్, ఆనంద్‌లను ఆలయ ధర్మకర్త ఎన్. వేణుగోపాల్ రెడ్డి సత్కరించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తులకు ఆధ్యాత్మిక కార్యక్రమాలతోపాటు వినోదాన్ని అందించడంపై నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు.