BREAKING
thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
Date of Publish : 15 October 2026, 03:33 pm
Posted by : THUNIKI NAGARAJU

అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
Thuniki Nagaraju రాయికల్ మండల ప్రతినిధి
15 Oct, 2026 - 03:33 PM
15 వీక్షణలు

అక్టోబర్ 31 వరకు వివిధ కార్యక్రమాలు.. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జగిత్యాల  జిల్లా: పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ అక్టోబర్ 21 నుంచి 31వ తేదీ వరకు సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ తెలిపారు. అక్టోబర్ 21న పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా స్మృతి పరేడ్ నిర్వహించి అమరవీరులకు నివాళులర్పించనున్నట్లు వెల్లడించారు.

ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 21 నుంచి జాతీయ ఐక్యత దినోత్సవమైన అక్టోబర్ 31 వరకు వివిధ అవగాహన, సంస్మరణ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఎస్పీ తెలిపారు.

ఓపెన్ హౌస్ కార్యక్రమాలు

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఆన్‌లైన్ వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా పోలీసులు వినియోగించే ఆయుధాలు, విధులు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలు, పోలీసుల సేవలు, ప్రతిభ గురించి అవగాహన కల్పించనున్నారు. ఆఫ్‌లైన్‌లో మండలాల వారీగా విద్యార్థులను పోలీస్ స్టేషన్లకు ఆహ్వానించి, స్టేషన్ నిర్వహణ, పోలీసుల విధులపై వివరించనున్నారు.

విద్యార్థులకు ఆన్‌లైన్ వ్యాసరచన పోటీలు

పోలీస్ అమరవీరుల సంస్మరణలో భాగంగా తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ లింక్‌ ద్వారా తమ వ్యాసాలను సమర్పించవచ్చు. వ్యాసాల సమర్పణకు అక్టోబర్ 28, 2026 చివరి తేదీగా నిర్ణయించారు.

12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు అంశాలు:

  1. సైబర్ నేరాల నివారణలో పౌరులు, పోలీసుల పాత్ర.

  2. మాదకద్రవ్యాల ముప్పు, వాటి నివారణలో పోలీసుల పాత్ర, విద్యార్థులు మాదకద్రవ్యాలకు ఎలా దూరంగా ఉండాలి?

డిగ్రీ, ఆపై చదువుతున్న విద్యార్థులకు అంశాలు:

  1. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడంలో పోలీసుల పాత్ర.

  2. తెలంగాణను మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చడంలో నా పాత్ర.

ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన ముగ్గురు అభ్యర్థులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

షార్ట్ ఫిల్మ్, ఫోటోగ్రఫీ పోటీలు

విద్యార్థులు, యువత, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల కోసం ఫోటోగ్రఫీ, షార్ట్ వీడియో పోటీలు నిర్వహించనున్నారు. పోలీసుల సేవలు, రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, కమ్యూనిటీ పోలీసింగ్, మూఢనమ్మకాలు, సామాజిక రుగ్మతలు, అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల స్పందన, ప్రకృతి వైపరీత్యాల సమయంలో పోలీసుల సేవలు తదితర అంశాలపై మూడు నిమిషాలకు మించకుండా వీడియోలు రూపొందించాలి.

ఈ పోటీల్లో ఉత్తమంగా నిలిచిన మూడు ఫోటోలు, మూడు వీడియోలను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. ఫోటోలు, వీడియోలను అక్టోబర్ 23, 2026లోపు సంబంధిత పోలీస్ స్టేషన్లలో అందించాలని ఎస్పీ సూచించారు.

రక్తదాన శిబిరాలు, సైకిల్ ర్యాలీలు

పోలీస్ అమరవీరుల సేవలను స్మరించుకుంటూ రక్తదాన శిబిరాలు, సైకిల్ ర్యాలీలు నిర్వహించనున్నారు. అమరవీరుల కుటుంబాలను సందర్శించి వారి త్యాగాలకు నివాళులర్పించనున్నారు. అక్టోబర్ 21 నుంచి 31 వరకు బహిరంగ ప్రదేశాల్లో పోలీస్ కళాబృందం ద్వారా పాటలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రధాన కూడళ్ల వద్ద అమరవీరుల వివరాలను తెలిపే బ్యానర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు.