నగర పారిశుద్ధ్యంపై కమిషనర్ ఆకస్మిక తనిఖీ
రోడ్లు, సెంట్రల్ మీడియన్లు పరిశుభ్రంగా ఉంచాలి.. ఆక్రమణలు, అనధికార బిల్‌బోర్డులు తొలగించాలి
హనుమకొండ: కాళోజీ కళాక్షేత్రం నుంచి ఆదాలా జంక్షన్ వరకు నగరపాలక సంస్థ కమిషనర్ టి. వెంకన్న ఆకస్మికంగా పర్యటించి నగర పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. రోడ్లు, సెంట్రల్ మీడియన్లు, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
నగరంలోని ప్రధాన రహదారులపై చెత్త పేరుకుపోకుండా నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా, రోడ్లు మరియు పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పరిశుభ్రత చర్యలు నిరంతరం కొనసాగించాలని అధికారులకు సూచించారు.
అలాగే ప్రధాన రహదారులు, ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన బిల్‌బోర్డులు, ఫ్లెక్సీలను తొలగించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ, రహదారుల పరిశుభ్రత, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణల తొలగింపుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ ఆదేశించారు.