BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 02 January 2026, 09:21 am
Posted by : NTODAY NEWS OFFICIAL

రాష్ట్రస్థాయి క్రీడాకారిణికి అభినందనలు

తెలంగాణ
02 Jan, 2026 - 09:21 AM
246 వీక్షణలు

రాష్ట్రస్థాయి క్రీడాకారిణికి అభినందనలు

NTODAY NEWS: చిట్యాల నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో అద్భుతమైన క్రీడా ప్రతిభను కనబరిచి ఉత్తమ క్రీడాకారిణిగా ఎంపికైంది. డిసెంబర్ 30, 31 మరియు జనవరి 1 తేదీల్లో వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం షరీఫ్ అన్నారం గ్రామంలోని పల్లవి మోడల్ స్కూల్‌లో తెలంగాణ రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 44వ తెలంగాణ రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో నల్గొండ జిల్లా జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. నల్గొండ జిల్లా జట్టు తరఫున చిట్యాల పట్టణంలోని గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న కొత్తపల్లి సహస్ర ఉత్తమ క్రీడాకారిణిగా ఎంపికైంది. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్ రెడ్డి విద్యార్థినికి జ్ఞాపికను అందజేసి అభినందించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడారంగంలో కూడా రాణించాలని అన్నారు. క్రీడల ద్వారా పోటీ తత్వాన్ని విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోవచ్చని, క్రీడారంగంలో ప్రతిభ చూపడం ద్వారా భవిష్యత్తులో ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏవోపోలా గోవర్ధన్, వ్యాయామ ఉపాధ్యాయుడు గంగాపురం రాము, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థినిని అభినందించారు. Follow us on Website Facebook Instagram YouTube