పట్టభద్రుల ఓటరు నమోదులో కాంగ్రెస్ నాయకులు
NTODAY NEWS చిట్యాల,
నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని చిట్యాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు. ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదేశాల మేరకు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎద్దులపూరి కృష్ణ, 11వ వార్డు కౌన్సిలర్ బొబ్బలి సందీప్ రామ్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటరు నమోదును చేపట్టారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్క పట్టభద్రులు ఓటర్ నమోదు చేసుకోవాలని కోరారు. అంతేకాకుండా భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కును వినియోగించి సరైన నాయకున్ని ఎన్నుకొని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు చొల్లేటి శ్రీకాంత్ చారి, సీనియర్ నాయకుడు మన్నెం సైదులు, మాజీ ఉపాధ్యక్షుడు దామనూరి సైదులు, శ్రీ బాల నరసింహస్వామి ఆలయ డైరెక్టర్ కల్లూరి నర్సిరెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకుడు గుంటోజు సంతోష్‌తో పాటు కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.