జనసేనలో చేరిన కాంగ్రెస్ రాష్ట్ర ఓబీసీ జనరల్ సెక్రటరీ పోలమరశెట్టి ఆదిమూర్తి
ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ సమక్షంలో పార్టీలో చేరిక
ఎలమంచిలి | ఎన్ టుడే న్యూస్: అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం నాగులపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఓబీసీ జనరల్ సెక్రటరీ పోలమరశెట్టి ఆదిమూర్తి జనసేన పార్టీలో చేరారు. ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ సమక్షంలో ఆయన జనసేన కండువా కప్పుకున్నారు.
నియోజకవర్గ అభివృద్ధికి ఆకర్షితుడినయ్యా: ఆదిమూర్తి
ఈ సందర్భంగా పోలమరశెట్టి ఆదిమూర్తి మాట్లాడుతూ ఎలమంచిలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ తక్కువ సమయంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తనను ఆకర్షించాయని తెలిపారు. గతంలో ఎన్నడూ జరగని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితుడై జనసేన పార్టీలో చేరినట్లు వెల్లడించారు.
కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు
ఈ పార్టీలో చేరిక కార్యక్రమంలో దొడ్డి శ్రీనివాసరావు, ఎల్లపు వెంకట భాస్కరరావు, పోలమరశెట్టి మురళి నూకలయ్య తదితరులు పాల్గొన్నారు.