BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 13 February 2026, 10:30 am
Posted by : NTODAY NEWS OFFICIAL

అధికార, ప్రతిపక్ష పార్టీలకు షాక్

తెలంగాణ
13 Feb, 2026 - 10:30 AM
324 వీక్షణలు
అధికార, ప్రతిపక్ష పార్టీలకు షాక్ – ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి విజయం 1వ వార్డు కౌన్సిలర్‌గా నాగిల్ల సుధాకర్ అలియాస్ కావేరి ఘన గెలుపు NTODAY NEWS: చిట్యాల నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ రాజకీయాల్లో విశేష పరిణామం చోటుచేసుకుంది. 1వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ట్రాన్స్‌జెండర్ నాగిల్ల సుధాకర్ (కావేరి) 103 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులను ఓడిస్తూ సాధించిన ఈ గెలుపు స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ప్రచార దశ నుంచే స్థానిక సమస్యలపై దృష్టి సారిస్తూ పారదర్శక పరిపాలన, సామాజిక సమానత్వంపై హామీలు ఇవ్వడం సుధాకర్‌కు అనుకూలంగా మారినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. యువత, మహిళలు, అణగారిన వర్గాల నుంచి విస్తృత మద్దతు లభించిందని సమాచారం. పార్టీ అండ లేకుండానే స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించడం ప్రజల్లో మారుతున్న ఆలోచనలకు సంకేతంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ట్రాన్స్‌జెండర్ సమాజానికి ఇది గర్వకారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. వార్డు అభివృద్ధికి కట్టుబడి ఉంటాను: నాగిల్ల సుధాకర్(కావేరి) విజయానంతరం నాగిల్ల సుధాకర్ మాట్లాడుతూ, ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కృషి చేస్తానన్నారు. 1వ వార్డు శివనేనిగూడెంలో కోతుల సమస్య పరిష్కారం, మిగిలిన సీసీ రోడ్ల నిర్మాణం, స్కూల్ నుంచి మహాలింగేశ్వర ఆలయం వరకు విద్యుత్ స్థంభాల ఏర్పాటు, తాగునీటి సమస్య నివారణకు అదనపు వాటర్ ప్లాంట్ ఏర్పాటు వంటి అంశాలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. వార్డు పరిశుభ్రత, విద్య, వైద్య సదుపాయాల మెరుగుదలతో పాటు సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు. #Chityal #TransgenderLeader #LocalElections2026 #TelanganaPolitics #NalgondaDistrict #IndependentCandidate #InclusivePolitics #MunicipalNews Follow us on Website Facebook Instagram YouTube