BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 15 October 2026, 10:22 pm
Posted by : SEETHA KIRAN KUMAR

వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు తుది దశకు

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
15 Oct, 2026 - 10:22 PM
11 వీక్షణలు

అక్టోబర్ 20న దసరా సందర్భంగా ఓపీ సేవల సాఫ్ట్ లాంచ్

డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యం

ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయం

వరంగల్: ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. వరంగల్‌లోని పాత సెంట్రల్ జైలు ప్రాంగణంలో నిర్మిస్తున్న 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. అక్టోబర్ 20న దసరా సందర్భంగా ఆసుపత్రిలో ఓపీ సేవలను సాఫ్ట్ లాంచ్ ద్వారా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆసుపత్రి నిర్మాణ పనుల పరిశీలన

ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సహచర మంత్రి ధనసరి అనసూయ సీతక్క, ఎంపీలు వేం. నరేందర్ రెడ్డి, బలరాం నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కే.ఎల్. నాగరాజు, కుడా చైర్‌పర్సన్ గుండు సుధారాణితో కలిసి ఆసుపత్రి నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైద్య శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, వైద్యాధికారులు, ఆర్‌అండ్‌బీ అధికారులు పాల్గొన్నారు.

ఆసుపత్రి ప్రాంగణమంతా పరిశీలించిన నాయకులు నిర్మాణ పనుల పురోగతి, వివిధ వైద్య విభాగాలు, రోగులకు కల్పించనున్న సదుపాయాలు, చికిత్సకు అవసరమైన మౌలిక వసతులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రి ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లపై కూడా సమీక్షించారు.

అక్టోబర్ 20న ఓపీ సేవల ప్రారంభం

గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించి అసంపూర్తిగా మిగిలిపోయిన ఆసుపత్రి నిర్మాణాన్ని ప్రజా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని ప్రభుత్వం తెలిపింది. అవసరమైన నిధులు కేటాయించి పనులను వేగవంతం చేయడంతో నిర్మాణం తుది దశకు చేరుకుందని పేర్కొంది.

చిన్నచిన్న పనులు మినహా ఆసుపత్రి సేవలకు సిద్ధమవుతోందని, అక్టోబర్ 20న దసరా సందర్భంగా ఓపీ సేవలను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని, అక్టోబర్ 17న మరోసారి నిర్మాణ పనులను పరిశీలించనున్నట్లు తెలిపింది.

డిసెంబర్ నాటికి పూర్తి స్థాయి సేవలు

ఆసుపత్రి అందుబాటులోకి వస్తే రోజుకు సుమారు 5,000 మంది వరకు రోగులకు వైద్య సేవలు అందించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. వరంగల్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

డిసెంబర్ నాటికి ఆసుపత్రిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం వైద్య రంగానికి ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొంది.