BREAKING
thumb ● తెలంగాణ ఆర్టీసీకి కొత్తగా 2,200 ఎలక్ట్రిక్ బస్సులు! thumb ● జనసేనకు షాక్‌.. వైఎస్సార్‌సీపీలో చేరిన అల్లవరపు రమణబాబు thumb ● జనసేనలో చేరిన కాంగ్రెస్‌ రాష్ట్ర ఓబీసీ జనరల్‌ సెక్రటరీ పోలమరశెట్టి ఆదిమూర్తి thumb ● కోట చంద్రశేఖర్‌కు అవకాశం కల్పించాలి thumb ● రామన్నపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట చిరుమర్తి లింగయ్య ధర్నా thumb ● సంప్రదాయ హక్కులు కల్పించాలి.. కుమ్మర సంఘం ధర్నా thumb ● చట్టం తన పని తాను చేస్తుంటే కాంగ్రెస్‌పై విమర్శలా? thumb ● జెండా హనుమాన్‌ ఆలయంలో ప్రతి శనివారం అన్నసత్రం thumb ● సీపీఐ సీనియర్‌ నాయకుడు కామ్రేడ్‌ అంజయ్య మృతి thumb ● డిండి ప్రాజెక్టుతో రైతులకు, ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతాల ప్రజలకు మేలు thumb ● తెలంగాణ ఆర్టీసీకి కొత్తగా 2,200 ఎలక్ట్రిక్ బస్సులు! thumb ● జనసేనకు షాక్‌.. వైఎస్సార్‌సీపీలో చేరిన అల్లవరపు రమణబాబు thumb ● జనసేనలో చేరిన కాంగ్రెస్‌ రాష్ట్ర ఓబీసీ జనరల్‌ సెక్రటరీ పోలమరశెట్టి ఆదిమూర్తి thumb ● కోట చంద్రశేఖర్‌కు అవకాశం కల్పించాలి thumb ● రామన్నపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట చిరుమర్తి లింగయ్య ధర్నా thumb ● సంప్రదాయ హక్కులు కల్పించాలి.. కుమ్మర సంఘం ధర్నా thumb ● చట్టం తన పని తాను చేస్తుంటే కాంగ్రెస్‌పై విమర్శలా? thumb ● జెండా హనుమాన్‌ ఆలయంలో ప్రతి శనివారం అన్నసత్రం thumb ● సీపీఐ సీనియర్‌ నాయకుడు కామ్రేడ్‌ అంజయ్య మృతి thumb ● డిండి ప్రాజెక్టుతో రైతులకు, ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతాల ప్రజలకు మేలు
మంచి మాట
Date of Publish : 25 October 2026, 07:02 am
Posted by : NAGARAJU GADE

చిన్న శ్రీను కుమార్తె నామినేషన్‌పై వివాదం.. కుల ధ్రువీకరణ పత్రంపై వైసీపీ ఫిర్యాదు!

ఆంధ్రప్రదేశ్
/ విజయనగరం
Reporter
Nagaraju Gade Santhakaviti Mandal
25 Oct, 2026 - 07:02 AM
25 వీక్షణలు

బీసీ రిజర్వుడ్ స్థానంలో ఓసీ అభ్యర్థి పోటీ ఎలా చేస్తారు?

విజయనగరం (ఎన్‌ టుడే న్యూస్‌): టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సిరి సహస్ర అలియాస్ ముస్కాన్ జైన్‌ కుల ధ్రువీకరణ పత్రం అంశం రాజకీయ వివాదానికి దారితీసింది. కొత్తవలస, తెర్లాం జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఆమె సమర్పించినట్లు చెబుతున్న బీసీ కుల ధ్రువీకరణ పత్రంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

సిరి సహస్ర అసలు పేరు ముస్కాన్ జైన్‌ అని, ఆమె తండ్రి పేరు రమేష్ జైన్‌ అని పేర్కొంటూ, ఆమె ఓసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ బీసీ కుల ధ్రువీకరణ పత్రం సమర్పించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీసీ రిజర్వేషన్‌ స్థానంలో పోటీ చేసేందుకు ఆమెకు అర్హత ఉందా అనే అంశంపై ఎన్నికల అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.

కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా సర్టిఫికెట్ ఇచ్చారా?

కుల ధ్రువీకరణ పత్రం జారీ విషయంలో కోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకున్నారా? సంబంధిత తహసీల్దార్‌ ఏ ఆధారాలతో బీసీ సర్టిఫికెట్‌ జారీ చేశారు? అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ ఎన్నికల అధికారులు నామినేషన్‌ను ఎలా స్వీకరించారు? అంటూ వైసీపీ నేతలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు, అభ్యర్థి వైపు నుంచి అధికారిక వివరణ అందాల్సి ఉంది.

నామినేషన్‌పై న్యాయపోరాటానికి వైసీపీ సిద్ధం

విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌ ఈ వ్యవహారంపై స్పందిస్తూ, సిరి సహస్ర నామినేషన్‌ను తిరస్కరించాలని కోరుతూ కోర్టును ఆశ్రయిస్తామని తెలిపినట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్‌ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల అర్హతలను ఎన్నికల అధికారులు నిబంధనల ప్రకారం పరిశీలించాలని వైసీపీ డిమాండ్‌ చేస్తోంది.

ఈ వ్యవహారంలో కుల ధ్రువీకరణ పత్రం నిజానిజాలు, అభ్యర్థి అర్హత, నామినేషన్‌ చెల్లుబాటు వంటి అంశాలపై సంబంధిత అధికారుల పరిశీలన, అవసరమైతే న్యాయస్థానం నిర్ణయం కీలకం కానున్నాయి.