రేబీస్ అనుమానంతో ఆవు మృతి.. ప్రసాదం తిన్న భక్తుల్లో ఆందోళన
ఆవు పాలతో దుర్గామాత ప్రసాదం తయారు చేసినట్లు సమాచారం
రంగంలోకి దిగిన ఆరోగ్య శాఖ.. 450 మందికి యాంటీ రేబీస్ టీకాలు
గోరఖ్‌పూర్, ఉత్తరప్రదేశ్ | ఎన్ టుడే న్యూస్: రేబీస్ వ్యాధితో ఆవు మృతి చెందినట్లు అనుమానాలు వ్యక్తం కావడంతో, ఆ ఆవు పాలతో తయారు చేసిన దుర్గామాత ప్రసాదం తిన్న భక్తుల్లో ఆందోళన నెలకొంది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలో ఈ ఘటన కలకలం రేపింది.
రెండు గ్రామాల్లోని భక్తుల్లో టెన్షన్
ఆవు పాలతో దుర్గామాత ప్రసాదం తయారు చేసి రెండు గ్రామాల్లో భక్తులకు పంపిణీ చేసినట్లు సమాచారం. ఆ ఆవుకు రేబీస్ సోకిందనే అనుమానాలు రావడంతో ప్రసాదం తిన్న వారిలో ఆందోళన మొదలైంది.
అప్రమత్తమైన ఆరోగ్య శాఖ
ఘటనపై అప్రమత్తమైన ఆరోగ్య శాఖ వైద్య బృందాలను రంగంలోకి దించింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా వైద్యులు సుమారు 450 మందికి యాంటీ రేబీస్ టీకాలు వేసినట్లు సమాచారం.
ఆవుకు నిజంగా రేబీస్ సోకిందా? ప్రసాదం తిన్నవారికి ఏదైనా ప్రమాదం ఉందా? అనే అంశాలపై అధికారిక నిర్ధారణకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.