BREAKING
thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు
Date of Publish : 18 October 2026, 05:19 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి జెడ్పీటీసీ స్థానానికి సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పోటీ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Oct, 2026 - 05:19 PM
42 వీక్షణలు

చాట్రాయి, అక్టోబర్ 18: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (జెడ్పీటీసీ) స్థానానికి సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఏలూరు జిల్లా ఇన్‌చార్జి డి. హరినాథ్ తెలిపారు. ఆదివారం చాట్రాయిలోని ఆంజనేయస్వామి కమిటీ హాలులో జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు అధ్యక్షతన నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో అభ్యర్థి పేరును ప్రకటిస్తామని, జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దించేందుకు సిద్ధమవుతున్నామని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించడం వల్ల అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని హరినాథ్ అన్నారు. రిజర్వేషన్లకు అనుగుణంగా పోటీ చేసేందుకు అవసరమైన ఎస్సీ, బీసీ కుల ధ్రువీకరణ పత్రాల కోసం అభ్యర్థులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలకు నిధులు మంజూరు చేయకుండా, పారిశుద్ధ్యం, విద్య, వైద్య రంగాలను ప్రైవేటీకరిస్తున్నాయని ఆరోపిస్తూ ఎన్డీఏ కూటమిని ఓడించాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించడంలో విఫలమైందని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజల కోసం పనిచేసే నాయకులను ఎన్నుకోవాలని, డబ్బులకు ప్రలోభపడకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సీపీఐ ఎంఎల్ లిబరేషన్ ఎన్నికల గుర్తు మూడు నక్షత్రాల జెండాపై ఓటు వేసి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు వేముల బక్కయ్య, ఉన్నం అనిల్ కుమార్, చాట్ల బాబురావు, ఎ. సుందరం, బంటు పూజిత, బీసీ తామా లక్ష్మి, భూతం మారయ్య, రాష్ట్ర కమిటీ సభ్యురాలు పరికళ కళావతి తదితరులు పాల్గొన్నారు.