తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై కీలక చర్చ.. ఫడణవీస్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ!
- ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుపై ప్రత్యేక ప్రజంటేషన్..
- సమావేశంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎస్ సంజయ్ జాజు
ముంబయి (ఎన్ టుడే న్యూస్): ప్రాణహిత–చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో కీలకమైన తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు ఖరారు అంశంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌తో సమావేశమయ్యారు. ముంబయిలోని సహ్యాద్రి స్టేట్ గెస్ట్‌హౌస్‌లో జరిగిన ఈ భేటీలో బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన కీలక అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.
తుమ్మిడిహెట్టి బ్యారేజీపై ప్రత్యేక ప్రజంటేషన్
ఈ సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పాల్గొన్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు ఖరారు అంశాన్ని వివరించేందుకు ప్రత్యేక ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు ముందుకు సాగేందుకు అవసరమైన అంశాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించినట్లు తెలుస్తోంది.
ప్రాజెక్టుపై కీలక నిర్ణయాలపై ఆసక్తి
తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు ఖరారు కావడం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పురోగతిలో కీలక అంశంగా పరిగణించబడుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగే చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, తదుపరి కార్యాచరణపై అధికారిక వివరాలు వెలువడాల్సి ఉంది.