BREAKING
thumb ● జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల వేళ రణరంగం! thumb ● బోయకొండ గంగమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.69.86 లక్షలు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదుపై ఉరుమడ్ల గ్రామ నాయకుల అవగాహన thumb ● చౌటుప్పల్‌లో శ్రీరామ జ్యువెలర్స్‌లో అగ్నిప్రమాదం thumb ● ముఠా గోపాల్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు thumb ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును కలిసిన మల్లేపల్లి రాజేందర్ రెడ్డి thumb ● అలయ్ బలయ్–2026 కార్యక్రమంలో పాల్గొన్న పీఏసీఎస్ చైర్మన్ మల్లేపల్లి బుచ్చిరెడ్డి thumb ● వలిగొండలో నూతన రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి స్థల పరిశీలన thumb ● మృతురాలి కుటుంబానికి బీఎన్ గౌడ్ రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● కొమ్మాయిగూడెంలో లోవోల్టేజ్ సమస్యకు పరిష్కారం thumb ● జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల వేళ రణరంగం! thumb ● బోయకొండ గంగమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.69.86 లక్షలు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదుపై ఉరుమడ్ల గ్రామ నాయకుల అవగాహన thumb ● చౌటుప్పల్‌లో శ్రీరామ జ్యువెలర్స్‌లో అగ్నిప్రమాదం thumb ● ముఠా గోపాల్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు thumb ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును కలిసిన మల్లేపల్లి రాజేందర్ రెడ్డి thumb ● అలయ్ బలయ్–2026 కార్యక్రమంలో పాల్గొన్న పీఏసీఎస్ చైర్మన్ మల్లేపల్లి బుచ్చిరెడ్డి thumb ● వలిగొండలో నూతన రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి స్థల పరిశీలన thumb ● మృతురాలి కుటుంబానికి బీఎన్ గౌడ్ రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● కొమ్మాయిగూడెంలో లోవోల్టేజ్ సమస్యకు పరిష్కారం
Date of Publish : 23 October 2026, 12:02 pm
Posted by : SEETHA KIRAN KUMAR

మధ్యప్రాచ్య ఉద్రిక్తతలతో క్రూడాయిల్ ధరలకు రెక్కలు.. బ్రెంట్ బ్యారెల్ $112.77

అంతర్జాతీయం అంతర్జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
23 Oct, 2026 - 12:02 PM
17 వీక్షణలు

ఎన్‌ టుడే న్యూస్‌: అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయి. సౌదీ అరేబియాపై హౌతీల దాడులు, ఇరాన్‌పై మరోసారి దాడులు జరిగే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఎగిశాయి.

బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 112.77 డాలర్లకు చేరింది. ఒక్క ట్రేడింగ్ సెషన్‌లోనే 4 డాలర్లు, అంటే 3.68 శాతం పెరిగింది. మరోవైపు వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ధర సుమారు 2 శాతం పెరిగి బ్యారెల్‌కు 99 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగితే చమురు సరఫరాపై ప్రభావం పడవచ్చన్న ఆందోళనలు ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ముడి చమురు ధరల పెరుగుదల కొనసాగితే భారత్ వంటి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలపై ఇంధన దిగుమతి వ్యయం, ద్రవ్యోల్బణం పరంగా ప్రభావం పడే అవకాశం ఉంది.