BREAKING
thumb ● నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ, సీపీఎం ఆగ్రహం thumb ● డిండి ఆయకట్టు పంటలను కాపాడేందుకు కల్వకుర్తి నీటిని విడుదల చేయాలి thumb ● రూ.2 కోట్లతో నిర్మించిన గిరిజన బాలికల వసతి గృహం ప్రారంభం thumb ● జర్నలిస్టుల హక్కుల సాధనకు సమష్టిగా పోరాడాలి thumb ● చౌడేపల్లిలో 9 జడ్పీటీసీ నామినేషన్ల ఆమోదం thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రం స్థలాన్ని చదును చేసిన వారాహి ఆగ్రో ఇండస్ట్రీస్ thumb ● వేసవిలో నీటి ఎద్దడి నివారణకు సర్పంచ్ ముందస్తు చర్యలు thumb ● పులివెందులలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మారెడ్డి లతా రెడ్డి ప్రచారం thumb ● బి. శాంతి నామినేషన్‌ తిరస్కరణపై ఆర్డీఓకు సీపీఐ అప్పీల్‌ thumb ● యాదగిరిగుట్టలో శాస్త్రోక్తంగా శ్రీవారి నిత్య కల్యాణం thumb ● నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ, సీపీఎం ఆగ్రహం thumb ● డిండి ఆయకట్టు పంటలను కాపాడేందుకు కల్వకుర్తి నీటిని విడుదల చేయాలి thumb ● రూ.2 కోట్లతో నిర్మించిన గిరిజన బాలికల వసతి గృహం ప్రారంభం thumb ● జర్నలిస్టుల హక్కుల సాధనకు సమష్టిగా పోరాడాలి thumb ● చౌడేపల్లిలో 9 జడ్పీటీసీ నామినేషన్ల ఆమోదం thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రం స్థలాన్ని చదును చేసిన వారాహి ఆగ్రో ఇండస్ట్రీస్ thumb ● వేసవిలో నీటి ఎద్దడి నివారణకు సర్పంచ్ ముందస్తు చర్యలు thumb ● పులివెందులలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మారెడ్డి లతా రెడ్డి ప్రచారం thumb ● బి. శాంతి నామినేషన్‌ తిరస్కరణపై ఆర్డీఓకు సీపీఐ అప్పీల్‌ thumb ● యాదగిరిగుట్టలో శాస్త్రోక్తంగా శ్రీవారి నిత్య కల్యాణం
మంచి మాట
Date of Publish : 25 October 2026, 06:19 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీ తీరానికి తుపాను ముప్పు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Oct, 2026 - 06:19 PM
25 వీక్షణలు

ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి 

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతోంది. గడిచిన ఆరు గంటల్లో గంటకు 5 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ వాయుగుండం ప్రస్తుతం విశాఖపట్నానికి 880 కిలోమీటర్లు, కాకినాడకు 980 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 1,080 కిలోమీటర్లు, బాపట్లకు 1,150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ వాయుగుండం ఆదివారం తీవ్ర వాయుగుండంగా, సోమవారం తుపానుగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మంగళవారం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడే అవకాశముంది. అనంతరం బుధవారం మధ్యాహ్నానికి అతి తీవ్ర తుపానుగా మారి బాపట్ల–విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తుపాను ముప్పు నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. అధికారిక హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలని, విపత్తుల నిర్వహణ శాఖ సూచించే ముందస్తు జాగ్రత్తలను పాటించాలని కోరారు.