దసరాలోపే మహిళలకు ఇందిరమ్మ చీరలు
జిల్లాకు 3.22 లక్షల చీరలు.. తొలి విడతగా 1.46 లక్షల చీరలు చేరిక
తెలంగాణ | Ntoday News
పేద మహిళలు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఉచితంగా ‘ఇందిరమ్మ చీరలు’ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దసరా పండుగలోపే చీరలను మహిళలకు అందించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
జిల్లాకు మొత్తం 3,22,255 చీరలు అవసరం కాగా.. తొలి విడతగా 1,46,711 చీరలు చేరినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే మండల కేంద్రాల్లోని సమాఖ్య కార్యాలయాల్లో చీరలను భద్రపరిచారు.
తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా చీరలను ప్రత్యేకంగా తయారు చేయించారు. చిలకపచ్చ రంగుతో పాటు గులాబీ రంగు అంచులతో ఆకర్షణీయంగా రూపొందించినట్లు అధికారులు తెలిపారు.
దసరా పండుగకు ముందే అర్హులైన మహిళలకు చీరల పంపిణీ పూర్తి చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, పేద మహిళలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కల్పించనున్నట్లు తెలిపారు.