BREAKING
thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రం స్థలాన్ని చదును చేసిన వారాహి ఆగ్రో ఇండస్ట్రీస్ thumb ● వేసవిలో నీటి ఎద్దడి నివారణకు సర్పంచ్ ముందస్తు చర్యలు thumb ● పులివెందులలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మారెడ్డి లతా రెడ్డి ప్రచారం thumb ● బి. శాంతి నామినేషన్‌ తిరస్కరణపై ఆర్డీఓకు సీపీఐ అప్పీల్‌ thumb ● యాదగిరిగుట్టలో శాస్త్రోక్తంగా శ్రీవారి నిత్య కల్యాణం thumb ● భువనగిరి: గుండెపోటుతో యువకుడి మృతి thumb ● సైదాపూర్‌ పోలీస్‌ ల్యాండ్‌లో సీసీ రోడ్డు పనులపై ఫిర్యాదులు? thumb ● రాసమల్ల శంకరమ్మ మృతి.. కాంగ్రెస్‌ నాయకుల నివాళులు thumb ● ఎల్‌నినో ప్రభావం నుంచి తెలంగాణ, దేశాన్ని కాపాడాలని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు thumb ● స్థానిక ఎన్నికలపై వైసీపీ ఆరోపణలకు భూమా అఖిలప్రియ కౌంటర్‌ thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రం స్థలాన్ని చదును చేసిన వారాహి ఆగ్రో ఇండస్ట్రీస్ thumb ● వేసవిలో నీటి ఎద్దడి నివారణకు సర్పంచ్ ముందస్తు చర్యలు thumb ● పులివెందులలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మారెడ్డి లతా రెడ్డి ప్రచారం thumb ● బి. శాంతి నామినేషన్‌ తిరస్కరణపై ఆర్డీఓకు సీపీఐ అప్పీల్‌ thumb ● యాదగిరిగుట్టలో శాస్త్రోక్తంగా శ్రీవారి నిత్య కల్యాణం thumb ● భువనగిరి: గుండెపోటుతో యువకుడి మృతి thumb ● సైదాపూర్‌ పోలీస్‌ ల్యాండ్‌లో సీసీ రోడ్డు పనులపై ఫిర్యాదులు? thumb ● రాసమల్ల శంకరమ్మ మృతి.. కాంగ్రెస్‌ నాయకుల నివాళులు thumb ● ఎల్‌నినో ప్రభావం నుంచి తెలంగాణ, దేశాన్ని కాపాడాలని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు thumb ● స్థానిక ఎన్నికలపై వైసీపీ ఆరోపణలకు భూమా అఖిలప్రియ కౌంటర్‌
మంచి మాట
Date of Publish : 25 October 2026, 06:56 pm
Posted by : మూసలమడుగు వెంకట్ ప్రసాద్

విజయవాడలో పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన డీసీపీ గుణ్ణం రామకృష్ణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
25 Oct, 2026 - 06:56 PM
10 వీక్షణలు
  • ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులకు సూచనలు
  • సమస్యాత్మక కేంద్రాల వద్ద సీసీటీవీలు, బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశం
  • సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి

విజయవాడ, ఎన్టీఆర్‌ జిల్లా | ఎన్ టుడే న్యూస్‌:

విజయవాడ నగరంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లను డీసీపీ గుణ్ణం రామకృష్ణ పరిశీలించారు. కొత్తపేట పోలీస్‌స్టేషన్‌ సీఐ కొండలరావు, స్టేషన్‌ ఎస్‌ఐలతో కలిసి సంబంధిత పోలింగ్‌ కేంద్రాలను సందర్శించారు.

ఈ సందర్భంగా పోలింగ్‌ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, ఓటర్ల రాకపోకలకు సంబంధించిన పరిస్థితులు, సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు తదితర అంశాలను పరిశీలించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, బందోబస్తు విధులను అప్రమత్తంగా నిర్వహించాలని పోలీసు అధికారులకు సూచించారు.

అవసరమైన పోలింగ్‌ కేంద్రాల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలని, సమస్యాత్మక కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డీసీపీ సూచించారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా తగిన భద్రత కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు పోలీస్‌ శాఖకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.