BREAKING
thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు
Date of Publish : 18 October 2026, 01:02 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలనులో జ్ఞానపీఠ పురస్కార గ్రహీతల వర్ధంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Oct, 2026 - 01:02 PM
41 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో ఆదివారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు విశ్వనాథ సత్యనారాయణ, రావూరి భరద్వాజ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరువురి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో కమిటీ సభ్యులు పద్మనాభుని కిషోర్ మాట్లాడుతూ విశ్వనాథ సత్యనారాయణ తెలుగు సాహిత్యానికి చేసిన సేవలను వివరించారు. ఆయన 25కు పైగా కావ్యాలు, ఆరు శతకాలు, 13 గేయ కావ్యాలు, 15 నాటకాలు, 58 నవలలు, పది సంస్కృత నాటకాలతో పాటు అనేక విమర్శన గ్రంథాలు, వ్యాసాలు రచించారని తెలిపారు. ఆయన రచించిన శ్రీమద్రామాయణ కల్పవృక్షము, వేయిపడగలు, ఆంధ్ర ప్రశస్తి, కిన్నెరసాని పాటలు విశేష ప్రాచుర్యం పొందాయని పేర్కొన్నారు. కమిటీ అధ్యక్షుడు ఊటుకూరు నారాయణరావు మాట్లాడుతూ రావూరి భరద్వాజ తెలుగు సాహిత్యానికి విశేష సేవలందించారని తెలిపారు. ఆయన 37 కథా సంపుటాలు, 17 నవలలు, ఆరు బాలల మినీ నవలలు, ఐదు బాలల కథా సంపుటాలు, మూడు వ్యాస, ఆత్మకథా సంపుటాలు, ఎనిమిది నాటికలు, ఐదు రేడియో కథానికలు రచించారని వివరించారు. బాలసాహిత్యంలోనూ రావూరి భరద్వాజ విశేష కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, గ్రామస్తులు, మహిళా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.