BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 04 March 2026, 06:18 am
Posted by : NTODAY NEWS OFFICIAL

జిల్లా ఆసుపత్రిలో DEIC కేంద్రం ప్రారంభం

తెలంగాణ
04 Mar, 2026 - 06:18 AM
437 వీక్షణలు
జిల్లా ఆసుపత్రిలో DEIC కేంద్రం ప్రారంభం NTODAY NEWS: నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున చిన్నారుల ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స లక్ష్యం నంద్యాల: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ (DEIC) ను ఏర్పాటు చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకట రమణ తెలిపారు. ఈ కేంద్రం ద్వారా జిల్లాలోని చిన్నారుల్లో కనిపించే జన్మతహ లోపాలు, శారీరక వైకల్యాలు, ఎదుగుదల లోపాలు, మానసిక సమస్యలు, వినికిడి మరియు మాట లోపాలు వంటి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించడం ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఉచిత వైద్య సేవలు ఈ DEIC కేంద్రంలో 0 నుండి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన చికిత్సలు అందించనున్నారు. ఇందులో భాగంగా ఫిజియోథెరపీ స్పీచ్ థెరపీ కౌన్సెలింగ్ వంటి ప్రత్యేక సేవలను కూడా అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేక నిపుణుల బృందం ద్వారా పిల్లల ఆరోగ్య పరిస్థితిని సమగ్రంగా పరిశీలించి, అవసరమైన చికిత్సా ప్రణాళికను రూపొందించనున్నట్లు వివరించారు. రిఫరల్ వ్యవస్థ ద్వారా సేవలు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ద్వారా గుర్తించిన పిల్లలను ఈ DEIC కేంద్రానికి రిఫర్ చేసి మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఈ కేంద్రం ద్వారా పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని వైద్యశాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో ఇది కీలక ముందడుగని, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకట రమణ విజ్ఞప్తి చేశారు. #Nandyal #DEIC #ChildHealth #DistrictHospital #HealthDepartment #APNews Follow us on Website Facebook Instagram YouTube