BREAKING
thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Date of Publish : 18 October 2026, 07:43 pm
Posted by : SEETHA KIRAN KUMAR

భద్రాచలంలో డిప్యూటీ తహసీల్దార్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో పలువురి పేర్లు!

తెలంగాణ
/ భద్రాద్రి కొత్తగూడెం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
18 Oct, 2026 - 07:43 PM
7 వీక్షణలు

రిపోర్టర్ల వేధింపులే కారణమంటూ ఆరోపణలు

దసరా మామూళ్ల పేరుతో కోటి రూపాయలు డిమాండ్ చేశారని సూసైడ్ నోట్‌లో ప్రస్తావన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మీనారాయణ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. పలువురు రిపోర్టర్ల వేధింపులు తాళలేకనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తన మృతికి పలువురు కారణమంటూ లక్ష్మీనారాయణ రాసినట్లు చెబుతున్న సూసైడ్ నోట్‌లో కొందరు రిపోర్టర్ల పేర్లు ఉన్నట్లు సమాచారం. కంప్యూటర్ ఆపరేటర్ తో పాటు పలువురు మీడియా ప్రతినిధుల పేర్లను కూడా అందులో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

కోటి రూపాయలు డిమాండ్ చేశారని ఆరోపణలు

దసరా మామూళ్ల పేరుతో తనను కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లు సూసైడ్ నోట్‌లో లక్ష్మీనారాయణ ఆరోపించినట్లు సమాచారం. డబ్బులు ఇవ్వకపోతే లైంగిక వేధింపుల ఆరోపణలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించినట్లు అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, సూసైడ్ నోట్‌లోని అంశాల ప్రామాణికత, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల పాత్రపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు అనంతరం వెల్లడించే వివరాలతో ఘటనకు సంబంధించిన వాస్తవాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది.