BREAKING
thumb ● నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ, సీపీఎం ఆగ్రహం thumb ● డిండి ఆయకట్టు పంటలను కాపాడేందుకు కల్వకుర్తి నీటిని విడుదల చేయాలి thumb ● రూ.2 కోట్లతో నిర్మించిన గిరిజన బాలికల వసతి గృహం ప్రారంభం thumb ● జర్నలిస్టుల హక్కుల సాధనకు సమష్టిగా పోరాడాలి thumb ● చౌడేపల్లిలో 9 జడ్పీటీసీ నామినేషన్ల ఆమోదం thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రం స్థలాన్ని చదును చేసిన వారాహి ఆగ్రో ఇండస్ట్రీస్ thumb ● వేసవిలో నీటి ఎద్దడి నివారణకు సర్పంచ్ ముందస్తు చర్యలు thumb ● పులివెందులలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మారెడ్డి లతా రెడ్డి ప్రచారం thumb ● బి. శాంతి నామినేషన్‌ తిరస్కరణపై ఆర్డీఓకు సీపీఐ అప్పీల్‌ thumb ● యాదగిరిగుట్టలో శాస్త్రోక్తంగా శ్రీవారి నిత్య కల్యాణం thumb ● నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ, సీపీఎం ఆగ్రహం thumb ● డిండి ఆయకట్టు పంటలను కాపాడేందుకు కల్వకుర్తి నీటిని విడుదల చేయాలి thumb ● రూ.2 కోట్లతో నిర్మించిన గిరిజన బాలికల వసతి గృహం ప్రారంభం thumb ● జర్నలిస్టుల హక్కుల సాధనకు సమష్టిగా పోరాడాలి thumb ● చౌడేపల్లిలో 9 జడ్పీటీసీ నామినేషన్ల ఆమోదం thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రం స్థలాన్ని చదును చేసిన వారాహి ఆగ్రో ఇండస్ట్రీస్ thumb ● వేసవిలో నీటి ఎద్దడి నివారణకు సర్పంచ్ ముందస్తు చర్యలు thumb ● పులివెందులలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మారెడ్డి లతా రెడ్డి ప్రచారం thumb ● బి. శాంతి నామినేషన్‌ తిరస్కరణపై ఆర్డీఓకు సీపీఐ అప్పీల్‌ thumb ● యాదగిరిగుట్టలో శాస్త్రోక్తంగా శ్రీవారి నిత్య కల్యాణం
మంచి మాట
Date of Publish : 25 October 2026, 06:16 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీలో ఎన్నికల హింసపై డీజీపీ సీరియస్..

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Oct, 2026 - 06:16 PM
19 వీక్షణలు
  • 31 ఘటనలు, 54 మంది నిందితుల గుర్తింపు హింసకు పాల్పడితే కఠిన చర్యలు..
  • నామినేషన్ పత్రాలను ధ్వంసం చేస్తే నాన్‌ బెయిలబుల్ కేసులు అభ్యర్థులకు పూర్తి రక్షణ కల్పిస్తాం.. డీజీపీ స్పష్టం


ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై డీజీపీ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో మొత్తం 31 ఎన్నికల సంబంధిత ఘటనలు నమోదైనట్లు వెల్లడించారు. వీటిలో 22 ప్రత్యక్ష హింసాత్మక ఘటనలు కాగా, నామినేషన్ పత్రాలను లాక్కోవడం, చించివేయడం వంటి ఘటనలు మరో తొమ్మిది ఉన్నట్లు తెలిపారు. టీడీపీ, వైసీపీ, సీపీఐఎం, స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించిన వివిధ ఘటనలు నమోదైనట్లు పేర్కొన్నారు. 16 కేసులు నమోదు.. 54 మందికి పైగా నిందితుల గుర్తింపు ఎన్నికల హింసకు సంబంధించి ఇప్పటివరకు 16 కేసులు నమోదు చేసినట్లు డీజీపీ తెలిపారు. మరో 11 ఘటనల్లో కేసుల నమోదు ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఈ ఘటనలకు సంబంధించి 54 మందికి పైగా నిందితులను గుర్తించామని, మిగిలిన వారిని గుర్తించి అరెస్టు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. నలుగురిని ఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరిపై భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌) సెక్షన్ 170 కింద ముందస్తు నిరోధక చర్యలు చేపట్టినట్లు వివరించారు. లాఠీచార్జ్.. టియర్ గ్యాస్ ప్రయోగం హింసాత్మక ఘటనల్లో పాల్గొన్న వారిని చెదరగొట్టేందుకు మూడు సందర్భాల్లో పోలీసులు లాఠీచార్జ్ చేసినట్లు డీజీపీ తెలిపారు. పోలీసు వాహనంపై దాడికి పాల్పడిన మూకను అదుపు చేసే క్రమంలో రెండు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించినట్లు వెల్లడించారు. అభ్యర్థులకు ఎస్కార్ట్‌గా వెళ్తున్న పోలీసు వాహనంపై రాళ్ల దాడి జరగడంతో ఓ కానిస్టేబుల్ తలకు గాయమైందన్నారు. మరోచోట పరిస్థితిని అదుపులోకి తెచ్చే క్రమంలో గాల్లోకి కాల్పులు జరిపినట్లు తెలిపారు. నామినేషన్ పత్రాల ధ్వంసం.. వాహనాలకు నిప్పు నామినేషన్ పత్రాలను లాక్కోవడం, చించివేయడం, ధ్వంసం చేయడం వంటి ఘటనలు మొత్తం 16 సార్లు జరిగినట్లు డీజీపీ ప్రకటనలో పేర్కొన్నారు. రాళ్లు, కర్రలతో దాడులకు సంబంధించి ఆరు ఘటనలు నమోదయ్యాయని తెలిపారు. రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు కలిపి మొత్తం నాలుగు వాహనాలకు నిప్పుపెట్టినట్లు వెల్లడించారు. రెండు ఇళ్లపై దాడులు జరగగా, ఒక ఇంటిని ఎర్త్‌మూవర్‌తో కూల్చివేసినట్లు వివరించారు. ఒక అభ్యర్థితో సహా ఇద్దరు తీవ్రంగా గాయపడగా, మరో మూడు ఘర్షణల్లో పలువురు గాయపడ్డారని తెలిపారు. మూడు ప్రాంతాల్లో రాస్తారోకోలు, రహదారుల దిగ్బంధంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు. అనంతపురంలో అత్యధిక ఘటనలు జిల్లాల వారీగా నమోదైన 31 ఎన్నికల సంబంధిత ఘటనల్లో అనంతపురం జిల్లాలో అత్యధికంగా ఎనిమిది ఘటనలు చోటుచేసుకున్నాయి. అన్నమయ్య జిల్లాలో మూడు, వైఎస్సార్ కడపలో మూడు, ప్రకాశంలో మూడు, తిరుపతిలో మూడు, చిత్తూరులో రెండు, శ్రీ సత్యసాయి జిల్లాలో రెండు, పల్నాడులో రెండు ఘటనలు నమోదయ్యాయి. నెల్లూరు, కర్నూలు, మార్కాపురం, నంద్యాల, ఏలూరు జిల్లాల్లో ఒక్కో ఘటన నమోదైనట్లు డీజీపీ వెల్లడించారు. హింసను ప్రేరేపించిన వారిపైనా విచారణ పార్టీలతో సంబంధం లేకుండా ఎన్నికల హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు. నామినేషన్ కేంద్రాల వద్ద అభ్యర్థుల పత్రాలను చించివేయడం, ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడితే నాన్‌ బెయిలబుల్ క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ప్రత్యక్షంగా దాడులకు పాల్పడిన వారితోపాటు హింసను ప్రేరేపించినవారు, మూకలను సమీకరించిన నాయకుల పాత్రపైనా సమగ్ర విచారణ జరుపుతామని తెలిపారు. నామినేషన్ కేంద్రాల వద్ద కర్రలు, రాళ్లు, ఆయుధాలతో సంచరించడాన్ని సహించబోమని హెచ్చరించారు. సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలు ఎన్నికల నేపథ్యంలో సున్నిత ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించాలని జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లను ఆదేశించినట్లు డీజీపీ తెలిపారు. అభ్యర్థులు, ఎన్నికల సిబ్బందికి పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎక్కడైనా ఎన్నికల హింస, బెదిరింపులు లేదా నామినేషన్లకు అడ్డంకులు ఎదురైతే వెంటనే 100 లేదా 112 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.