BREAKING
thumb ● పులివెందులలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందుల 15వ వార్డుపై అందరి దృష్టి thumb ● తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పోగుల సుతేజ్ thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ thumb ● ఉరుమడ్లలో 180 మంది వృద్ధులకు నూతన వస్త్రాల పంపిణీ thumb ● చెడుపై మంచి విజయానికి ప్రతీక.. దసరా పండుగ విశిష్టత thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● పులివెందులలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందుల 15వ వార్డుపై అందరి దృష్టి thumb ● తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పోగుల సుతేజ్ thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ thumb ● ఉరుమడ్లలో 180 మంది వృద్ధులకు నూతన వస్త్రాల పంపిణీ thumb ● చెడుపై మంచి విజయానికి ప్రతీక.. దసరా పండుగ విశిష్టత thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత
Date of Publish : 21 October 2026, 02:10 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో కూటమి పార్టీల మధ్య విభేదాలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Oct, 2026 - 02:10 PM
2 వీక్షణలు

తనకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయానికి రానని ఎమ్మెల్యే కొలికపూడి స్పష్టం బి-ఫాంల కేటాయింపుపై గద్దె అనురాధతో ఎమ్మెల్యే చర్చలు.. నామినేషన్ల ఉపసంహరణ వేళ రాజకీయ వేడి

తిరువూరు, ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య అభ్యర్థుల ఎంపిక, బి-ఫాంల పంపిణీ అంశాలు రాజకీయ చర్చకు దారితీశాయి. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ మధ్య చోటుచేసుకున్న పరిణామాలు స్థానిక రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.

తిరువూరు మున్సిపల్ స్థానాన్ని కూటమి పార్టీల నిర్ణయం మేరకు జనసేనకు కేటాయించారు. అయితే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తన వర్గానికి చెందిన పెనుమల్లి శ్రావణిని పోటీలో నిలపడంతో అభ్యర్థుల ఎంపిక అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో తన వర్గానికి చెందిన కౌన్సిలర్ అభ్యర్థులకు సంబంధించిన బి-ఫాంలను ఇవ్వాలని ఎమ్మెల్యే గద్దె అనురాధను కోరినట్లు సమాచారం.

బి-ఫాంలు సీల్డ్ కవర్లలో ఉన్నందున వాటిని ఇక్కడ తెరిచి ఇవ్వడం సాధ్యం కాదని గద్దె అనురాధ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఎంపీ చిన్ని వర్గానికి చెందిన నాయకులు కార్యకలాపాలు నిర్వహిస్తున్న పట్టణ పార్టీ కార్యాలయానికి రావాలని ఆమె ఎమ్మెల్యేకు సూచించినట్లు సమాచారం.

అయితే తనకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన కార్యాలయానికి తాను రానని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ పరిణామం కూటమి పార్టీల మధ్య స్థానికంగా నెలకొన్న విభేదాలను మరోసారి తెరపైకి తెచ్చింది.

కూటమి నిర్ణయం మేరకు తిరువూరు మున్సిపల్ స్థానాన్ని జనసేనకు కేటాయించిన నేపథ్యంలో, అభ్యర్థుల ఎంపికతో పాటు బి-ఫాంల పంపిణీ కూడా కీలకంగా మారింది. మరోవైపు కౌన్సిలర్ స్థానాలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు నేపథ్యంలో ఈ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

నామినేషన్ల ఉపసంహరణ రోజున చోటుచేసుకున్న ఈ పరిణామాలతో తిరువూరు మున్సిపల్ ఎన్నికల రాజకీయాలు వేడెక్కాయి. కూటమి పార్టీల నిర్ణయాలు, అభ్యర్థుల పోటీ, స్థానిక నాయకుల మధ్య సమన్వయం వంటి అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.