పొందూరులో పీవీఎం 22 ఫౌండేషన్ ఆధ్వర్యంలో వస్త్రాల పంపిణీ
నిరుపేద కుటుంబాలకు చీరలు, లుంగీలు, షర్టుల అందజేత
లక్కీ డిప్లో ఎంపికైన ముగ్గురికి ఫ్యాన్లు బహుమతిగా పంపిణీ
పొందూరు: దసరా పండుగను పురస్కరించుకుని పీవీఎం 22 ఫౌండేషన్, ఎం. నిడమానూరు ఆధ్వర్యంలో టంగుటూరు మండలం పొందూరు గ్రామంలోని ఎస్టీ కాలనీలో వస్త్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కాలనీలో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు కొత్త బట్టలు అందజేశారు. మహిళలకు చీరలు, పురుషులకు లుంగీలు, షర్టులు పంపిణీ చేశారు.
పండుగ ఆనందాన్ని అందరితో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు.
లక్కీ డిప్లో ముగ్గురికి ఫ్యాన్లు
వస్త్రాల పంపిణీ అనంతరం కాలనీవాసుల కోసం సరదా గేమ్షో నిర్వహించారు. కాలనీలోని ఇళ్ల పేర్లను చీటీలపై రాసి లక్కీ డిప్ నిర్వహించారు. ఇందులో ఎంపికైన ముగ్గురికి ఫ్యాన్లను బహుమతులుగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో పీవీఎం 22 ఫౌండేషన్ సభ్యులు పబ్బిశెట్టి సుదర్శన్, పబ్బిశెట్టి వెంకట కళ్యాణ్, బచ్చు సురేష్ కుమార్, చక్కా కార్తీక్, కనుమర్లపూడి శేషారావు తదితరులు పాల్గొన్నారు.