400 గ్యాస్ కనెక్షన్లదారులకు రూ.2 లక్షల విలువైన పైపుల పంపిణీ
ఆరెగూడెం సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్
ఆరెగూడెం (ఎన్ టుడే న్యూస్): గ్రామ ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తూ, వారి సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తున్నామని నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామ సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్ తెలిపారు. గ్రామంలో శుక్రవారం 400 గ్యాస్ కనెక్షన్లదారులకు రూ.2 లక్షల విలువైన గ్యాస్ పైపులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామంలో ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జుంజు రాజు, వార్డు సభ్యుడు రాచమల్ల మహేష్, నాయకులు సాపిడి అశోక్, లడె శ్రీను, సిందే అంజనేయులు, ఎడ్డె ఉమేష్‌తో పాటు గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.