శ్రమశక్తి యువజన సంఘం ఆధ్వర్యంలోమున్సిపల్ సిబ్బందికి చీరల పంపిణీ
ఆకర్షణీయమైన బతుకమ్మలకు బహుమతులు అందజేత
NTODAY NEWS చిట్యాల
నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు ముత్యాలమ్మగూడెంలో శ్రమశక్తి యువజన సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో మహిళలు సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను పేర్చి, ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
బతుకమ్మ సంబరాల్లో భాగంగా ప్రతి బతుకమ్మకు శ్రమశక్తి యువజన సంఘం తరఫున బహుమతులు అందజేశారు. అదేవిధంగా మున్సిపాలిటీ సిబ్బందికి చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం మహిళల్లో ఆనందోత్సాహాలను నింపడంతో పాటు, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పట్ల సంఘం సభ్యుల అభిమానాన్ని చాటింది.
ఈ కార్యక్రమంలో కనకదుర్గ ఆలయ చైర్మన్ మారగొని ఆంజనేయులు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, శ్రమశక్తి యువజన సంఘం సభ్యులు, కాలనీ కుటుంబ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.