BREAKING
thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు
Date of Publish : 16 October 2026, 05:40 pm
Posted by : KOLA MAHESH

సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / నారాయణపూర్
Reporter
Kola Mahesh Munugodu Constituency
16 Oct, 2026 - 05:40 PM
5 వీక్షణలు

లబ్ధిదారులకు కార్డులు అందజేసిన సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి

సంక్షేమ పథకాల అమలులో రేషన్ కార్డు కీలకం

సంస్థాన్ నారాయణపురం: మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి, పాలకవర్గ సభ్యులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పేద ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందేందుకు రేషన్ కార్డు ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రజా పాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పలు పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పల్లె మల్లారెడ్డి, పంచాయతీ కార్యదర్శి నవీన్ కుమార్, మాజీ సర్పంచ్ కొండ్రెడ్డి నరసింహ, జిల్లా కాంగ్రెస్ నాయకుడు మందుగుల బాలకృష్ణ, వార్డు సభ్యులు పందుల యాదగిరి గౌడ్, సింగం బిక్షపతి, సూరపల్లి వెంకటేష్, కట్ల వనజ భాస్కరాచారి, పట్నం బాలకృష్ణ గౌడ్, సభావత్ రఘు నాయక్, నీళ్ల అనిత శంకర్, చింతల శైలజ సత్యనారాయణ, సింగపంగ ప్రశాంతి రమేష్, మహమ్మద్ అలీమా యూసఫ్ ఖాన్ పాల్గొన్నారు.

అలాగే చేనేత సహకార సంఘం అధ్యక్షుడు చిలుకూరు శీను, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి చిలువేరు శంకర్, టీఆర్‌ఎస్ నాయకుడు వడ్డేపల్లి రాములు సాగర్, చేనేత సహకార సంఘం డైరెక్టర్ దువ్వ విజయలక్ష్మి, కాంగ్రెస్ నాయకుడు రాచకొండ లింగస్వామి, గ్రామస్థులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.