BREAKING
thumb ● చిట్యాలలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం thumb ● ఐఆర్‌సీఏ పునరావాస కేంద్రంలో బాధితులకు కౌన్సెలింగ్ ఇచ్చిన కౌన్సిలర్ కోనేటి ఎల్లయ్య thumb ● సొంత ఖర్చులతో స్మశానవాటిక అభివృద్ధి పనులు చేపట్టిన కుమారులు thumb ● ఇంటింటి ప్రచారంలో ప్రజా సమస్యలు తెలుసుకున్న తూగుట్ల మధుసూదన్ రెడ్డి thumb ● పులివెందులలో టీడీపీ చెప్పాం.. చేస్తున్నాం ప్రచార పోస్టర్ ఆవిష్కరణ thumb ● వైఎస్సార్‌సీపీ ప్రచార కార్యక్రమం షెడ్యూల్ విడుదల thumb ● కేవీబీపురంలో ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల ప్రక్రియ thumb ● హైవేపై బైక్‌ను ఢీకొట్టిన కారు.. వ్యక్తికి తీవ్ర గాయాలు thumb ● శ్రీకాళహస్తిలో నామినేషన్లపై టీడీపీ ఆందోళన thumb ● ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ thumb ● చిట్యాలలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం thumb ● ఐఆర్‌సీఏ పునరావాస కేంద్రంలో బాధితులకు కౌన్సెలింగ్ ఇచ్చిన కౌన్సిలర్ కోనేటి ఎల్లయ్య thumb ● సొంత ఖర్చులతో స్మశానవాటిక అభివృద్ధి పనులు చేపట్టిన కుమారులు thumb ● ఇంటింటి ప్రచారంలో ప్రజా సమస్యలు తెలుసుకున్న తూగుట్ల మధుసూదన్ రెడ్డి thumb ● పులివెందులలో టీడీపీ చెప్పాం.. చేస్తున్నాం ప్రచార పోస్టర్ ఆవిష్కరణ thumb ● వైఎస్సార్‌సీపీ ప్రచార కార్యక్రమం షెడ్యూల్ విడుదల thumb ● కేవీబీపురంలో ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల ప్రక్రియ thumb ● హైవేపై బైక్‌ను ఢీకొట్టిన కారు.. వ్యక్తికి తీవ్ర గాయాలు thumb ● శ్రీకాళహస్తిలో నామినేషన్లపై టీడీపీ ఆందోళన thumb ● ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ
మంచి మాట
Date of Publish : 24 October 2026, 04:32 pm
Posted by : కూనురు మధు

ఎల్‌నినోపై రైతుల్లో భయాందోళనలు సృష్టించొద్దు : నకిరేకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ వేముల వీరేశం

తెలంగాణ
/ హైదరాబాద్
24 Oct, 2026 - 04:32 PM
8 వీక్షణలు
  • ఎల్‌నినోపై రైతుల్లో భయాందోళనలు సృష్టించొద్దు
  • ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి: ప్రభుత్వ విప్ వేముల వీరేశం
NTODAY NEWS :  హైదరాబాద్, 

ఎల్‌నినో ప్రభావం తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాలేదని, ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులపై ప్రభావం చూపుతోందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూస్తూ రైతుల్లో భయాందోళనలు సృష్టించడం సరికాదని, ప్రధాన ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంపై వాస్తవాలను అర్థం చేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో, కోదండరెడ్డి నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఎల్‌నినో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ప్రతి పది రోజులకు ఒకసారి పంట మార్పిడి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసినప్పటికీ ఆశించిన ప్రయోజనం అందలేదని విమర్శించారు. ప్రాజెక్టు వైఫల్యాలకు నాటి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. కరోనా సమయంలో రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల బ్లాక్ మార్కెట్ వ్యవహారంపై బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దొడ్డు వడ్లు పండిస్తే రైతుబంధు రాదనే ప్రచారంతో గతంలో రైతులను అయోమయానికి గురిచేశారని, వరి సాగుపై భయాందోళనలు సృష్టించిన చరిత్ర బీఆర్ఎస్‌దేనని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ప్రజలకు హామీలు ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. శివన్నగూడెం ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదని, దళితులకు మూడు ఎకరాల భూమి హామీ ఏమైందని, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల హామీల అమలుపై సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేలా అబద్ధాలు, నిరాధార ఆరోపణలు చేయకుండా ప్రతిపక్షం నిర్మాణాత్మక సూచనలు చేయాలని వేముల వీరేశం హితవు పలికారు. విపత్తుల సమయంలో రైతులకు, ప్రజలకు భరోసా కల్పించడమే రాజకీయ పార్టీల బాధ్యత కావాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.