కుష్టు వ్యాధి లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు
తెలంగాణ
/
హన్మకొండ
ఈ నెల 22 నుంచి నవంబర్ 4 వరకు ఇంటింటి గుర్తింపు కార్యక్రమం
వరంగల్: కుష్టు వ్యాధి గుర్తింపుపై వరంగల్లో పునశ్చరణ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ బి. రాజా రెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 22 నుంచి నవంబర్ 4 వరకు ఇంటింటి కుష్టు వ్యాధి గుర్తింపు కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు.
చర్మంపై స్పర్శజ్ఞానం లేని మచ్చలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కుష్టు వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం చేయవచ్చని పేర్కొన్నారు. వ్యాధి లక్షణాలపై ప్రజలకు అవగాహన కల్పించి, సకాలంలో చికిత్స పొందేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు.