నవీన్ రెడ్డి మృతిపై అనుమానాలు.. హత్య చేశారని తండ్రి ఆరోపణ
ఆంధ్రప్రదేశ్
/
ప్రకాశం
ముందస్తు ప్రణాళికతో దాడి చేసి చంపారని ఫిర్యాదు
నిందితులను కఠినంగా శిక్షించాలని గురువారెడ్డి డిమాండ్
కొనకనమిట్ల: మండలంలోని కొనకనమిట్ల గ్రామానికి చెందిన నవీన్ రెడ్డి మృతి ఘటనలో ఆయన తండ్రి గురువారెడ్డి హత్య ఆరోపణలు చేశారు. తన కుమారుడిని కొట్టి చంపి, కొండ సమీపంలోని చెట్ల పొదల్లో పడేశారని ఆరోపించారు.
పలువురు ముందస్తు ప్రణాళికతో తన కుమారుడిపై దాడి చేసి హత్యకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. తన కుమారుడి మృతికి కారణమైన వారిని గుర్తించి, కఠినంగా శిక్షించాలని గురువారెడ్డి కోరారు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి, మృతికి గల కారణాలు, ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలపై నిజానిజాలు తేల్చాల్సి ఉంది.