BREAKING
thumb ● పులివెందులలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందుల 15వ వార్డుపై అందరి దృష్టి thumb ● తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పోగుల సుతేజ్ thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ thumb ● ఉరుమడ్లలో 180 మంది వృద్ధులకు నూతన వస్త్రాల పంపిణీ thumb ● చెడుపై మంచి విజయానికి ప్రతీక.. దసరా పండుగ విశిష్టత thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● పులివెందులలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందుల 15వ వార్డుపై అందరి దృష్టి thumb ● తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పోగుల సుతేజ్ thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ thumb ● ఉరుమడ్లలో 180 మంది వృద్ధులకు నూతన వస్త్రాల పంపిణీ thumb ● చెడుపై మంచి విజయానికి ప్రతీక.. దసరా పండుగ విశిష్టత thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత
Date of Publish : 21 October 2026, 02:03 pm
Posted by : SEETHA KIRAN KUMAR

వరంగల్‌–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
21 Oct, 2026 - 02:03 PM
5 వీక్షణలు
  • దసరా సందర్భంగా అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
  • ఎన్నికల కోఆర్డినేటర్‌, అబ్జర్వర్‌గా సయ్యద్ ఇస్మాయిల్ నియామకం
  • తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర
  • ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ దృష్టి

తెలంగాణ | ఎన్ టుడే న్యూస్: వరంగల్‌–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి తెలంగాణ రక్షణ సేన అభ్యర్థిగా తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. దసరా పండుగ సందర్భంగా పార్టీ తరఫున ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్న తొలి అభ్యర్థిగా శ్రీకాంత్ గౌడ్ పేరును ఖరారు చేశారు.

తెలంగాణ రక్షణ సేన పార్టీ స్థాపించిన తర్వాత తొలిసారిగా శాసనమండలి ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో వరంగల్‌–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయం కోసం పార్టీ సీనియర్ నాయకుడు సయ్యద్ ఇస్మాయిల్‌ను రాష్ట్ర పార్టీ అబ్జర్వర్‌, ఎన్నికల కోఆర్డినేటర్‌గా నియమించారు.

డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుత మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లికి చెందినవారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్నారు.

తెలంగాణ జాగృతి ప్రారంభం నుంచి కల్వకుంట్ల కవితతో కలిసి పనిచేశారు. పార్టీ అధికార ప్రతినిధిగా టీవీ చర్చా కార్యక్రమాలు, ప్రజా సంఘాల సమావేశాల్లో పార్టీ తరఫున తన వాణిని వినిపించారు.

గత మూడేళ్లుగా బహుజనుల గొంతుకగా పలు ఉద్యమాలకు రూపకల్పన చేసిన కల్వకుంట్ల కవిత, తెలంగాణ రక్షణ సేన తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటనతో ఎన్నికల కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరఫున తొలి అభ్యర్థిగా శ్రీకాంత్ గౌడ్‌ను ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

ఎన్నికల సమన్వయం, పార్టీ శ్రేణులను సిద్ధం చేయడం, ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం వంటి బాధ్యతలను సయ్యద్ ఇస్మాయిల్‌కు అప్పగించారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది.