BREAKING
thumb ● స్వర్ణకారుల బంగారు బిహారంగ సభకు హాజరుకావాలి: ప్రభు చారి విజ్ఞప్తి thumb ● పోలింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించిన పులివెందుల ఆర్డీవో చెన్నయ్య thumb ● యర్రిపల్లిలో పులివెందుల వ్యవసాయ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక శిబిరం thumb ● సింహాద్రిపురంలో జోరుగా నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందులలో జోరందుకున్న మున్సిపల్ పోరు నగరిగుట్టలో కూటమి ముమ్మర ప్రచారం! ​ thumb ● తిరుపతి రూరల్ జెడ్పీటీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున కె. జ్యోతీశ్వర్ నాయక్ నామినేషన్ దాఖలు! thumb ● మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గీతా కుమారి తరఫున తూగుట్ల మధు ముమ్మర ప్రచారం thumb ● పులివెందులలో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం జోరు thumb ● వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా పంచామృత అభిషేకం thumb ● జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల వేళ రణరంగం! thumb ● స్వర్ణకారుల బంగారు బిహారంగ సభకు హాజరుకావాలి: ప్రభు చారి విజ్ఞప్తి thumb ● పోలింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించిన పులివెందుల ఆర్డీవో చెన్నయ్య thumb ● యర్రిపల్లిలో పులివెందుల వ్యవసాయ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక శిబిరం thumb ● సింహాద్రిపురంలో జోరుగా నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందులలో జోరందుకున్న మున్సిపల్ పోరు నగరిగుట్టలో కూటమి ముమ్మర ప్రచారం! ​ thumb ● తిరుపతి రూరల్ జెడ్పీటీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున కె. జ్యోతీశ్వర్ నాయక్ నామినేషన్ దాఖలు! thumb ● మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గీతా కుమారి తరఫున తూగుట్ల మధు ముమ్మర ప్రచారం thumb ● పులివెందులలో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం జోరు thumb ● వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా పంచామృత అభిషేకం thumb ● జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల వేళ రణరంగం!
మంచి మాట
Date of Publish : 23 October 2026, 06:05 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జి.కొండూరు జెడ్పీటీసీ అభ్యర్థిగా డాక్టర్ రేవతి చంద్రిక నామినేషన్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Oct, 2026 - 06:05 PM
23 వీక్షణలు
  • జి.కొండూరు జెడ్పీటీసీ బరిలో డాక్టర్ రేవతి చంద్రిక
  • ఎన్డీఏ కూటమి మద్దతుతో టీడీపీ అభ్యర్థిగా నామినేషన్‌..
  • యువ నాయకత్వానికి అవకాశం

ఎన్టీఆర్ జిల్లా (ఎన్‌ టుడే న్యూస్‌): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జి.కొండూరు మండల జెడ్పీటీసీ స్థానానికి రాజకీయ సందడి నెలకొంది. ఎన్డీఏ కూటమి మద్దతుతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా డాక్టర్ వేములకొండ రేవతి చంద్రిక శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. వైద్య విద్యను అభ్యసించిన యువ నాయకురాలికి అవకాశం కల్పించడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

నామినేషన్‌ అనంతరం రేవతి చంద్రిక గొల్లపూడిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

రాజకీయ కుటుంబం నుంచి ప్రజాసేవలోకి..

జి.కొండూరు మండలం పినపాక గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్‌ నాయకుడు వేములకొండ రామారావు మనుమరాలు రేవతి చంద్రిక. ఎన్నారై మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన ఆమె, రాజకీయాలపై ఆసక్తితో ప్రజాసేవలోకి అడుగుపెడుతున్నారు. జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తూ మండల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

యువతకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించాలి: ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ ఆశయాలు, పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువ నాయకత్వ స్ఫూర్తితో యువతకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించేందుకు పార్టీ కృషి చేస్తోందని తెలిపారు.

యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు.

మండల అభివృద్ధికి కృషి చేస్తా: రేవతి చంద్రిక

డాక్టర్ వేములకొండ రేవతి చంద్రిక మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని తెలిపారు. జి.కొండూరు మండల అభివృద్ధికి కృషి చేయడంతోపాటు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో తనతోపాటు పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలిపి తమ విలువైన ఓటుతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.