BREAKING
thumb ● చిట్యాలలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం thumb ● ఐఆర్‌సీఏ పునరావాస కేంద్రంలో బాధితులకు కౌన్సెలింగ్ ఇచ్చిన కౌన్సిలర్ కోనేటి ఎల్లయ్య thumb ● సొంత ఖర్చులతో స్మశానవాటిక అభివృద్ధి పనులు చేపట్టిన కుమారులు thumb ● ఇంటింటి ప్రచారంలో ప్రజా సమస్యలు తెలుసుకున్న తూగుట్ల మధుసూదన్ రెడ్డి thumb ● పులివెందులలో టీడీపీ చెప్పాం.. చేస్తున్నాం ప్రచార పోస్టర్ ఆవిష్కరణ thumb ● వైఎస్సార్‌సీపీ ప్రచార కార్యక్రమం షెడ్యూల్ విడుదల thumb ● కేవీబీపురంలో ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల ప్రక్రియ thumb ● హైవేపై బైక్‌ను ఢీకొట్టిన కారు.. వ్యక్తికి తీవ్ర గాయాలు thumb ● శ్రీకాళహస్తిలో నామినేషన్లపై టీడీపీ ఆందోళన thumb ● ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ thumb ● చిట్యాలలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం thumb ● ఐఆర్‌సీఏ పునరావాస కేంద్రంలో బాధితులకు కౌన్సెలింగ్ ఇచ్చిన కౌన్సిలర్ కోనేటి ఎల్లయ్య thumb ● సొంత ఖర్చులతో స్మశానవాటిక అభివృద్ధి పనులు చేపట్టిన కుమారులు thumb ● ఇంటింటి ప్రచారంలో ప్రజా సమస్యలు తెలుసుకున్న తూగుట్ల మధుసూదన్ రెడ్డి thumb ● పులివెందులలో టీడీపీ చెప్పాం.. చేస్తున్నాం ప్రచార పోస్టర్ ఆవిష్కరణ thumb ● వైఎస్సార్‌సీపీ ప్రచార కార్యక్రమం షెడ్యూల్ విడుదల thumb ● కేవీబీపురంలో ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల ప్రక్రియ thumb ● హైవేపై బైక్‌ను ఢీకొట్టిన కారు.. వ్యక్తికి తీవ్ర గాయాలు thumb ● శ్రీకాళహస్తిలో నామినేషన్లపై టీడీపీ ఆందోళన thumb ● ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ
మంచి మాట
Date of Publish : 24 October 2026, 04:43 pm
Posted by : SEETHA KIRAN KUMAR

హైదరాబాద్‌కు వస్తున్న బస్సులో రూ.1.1 కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
24 Oct, 2026 - 04:43 PM
7 వీక్షణలు
  • భోపాల్‌ నుంచి వచ్చిన ప్రయాణికుల బస్సులో తనిఖీలు
  • స్లీపర్ బెర్త్‌ల పరుపుల మధ్య నాలుగు ప్యాకెట్లలో మెథాంఫెటమైన్‌ గుర్తింపు
  • పరుపుల మధ్య డ్రగ్స్‌ దాచివేత సరఫరా వెనుక ఎవరున్నారు?

హైదరాబాద్ | ఎన్ టుడే న్యూస్: భోపాల్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికుల బస్సులో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు భారీ మొత్తంలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. బస్సులో దాచిన 1.136 కిలోల మెథాంఫెటమైన్‌ను గుర్తించారు. దీని విలువ సుమారు రూ.1.1 కోట్లుగా అంచనా వేశారు.

బస్సులో తనిఖీలు నిర్వహించిన డీఆర్‌ఐ అధికారులు స్లీపర్‌ బెర్త్‌ల కింద పరుపుల మధ్య నాలుగు ప్యాకెట్లలో దాచిన మాదకద్రవ్యాలను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ చేపట్టినట్లు సమాచారం.

ఈ మాదకద్రవ్యాలను ఎవరు తరలిస్తున్నారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరికి సరఫరా చేయాలనుకున్నారు అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.