లింగపాలెం నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన డీఎస్పీ వెంకటేశ్వర్లు
ఏలూరు జిల్లా లింగపాలెం మండల పరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఎంపీటీసీ నామినేషన్ల కేంద్రాన్ని జంగారెడ్డిగూడెం డీఎస్పీ వెంకటేశ్వర్లు సందర్శించి భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా సజావుగా జరిగేలా పోలీసులు చేపట్టిన చర్యలను సమీక్షించారు. నామినేషన్ల కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు, బారికేడ్లు, సీసీ కెమెరాల నిఘా తదితర ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని పోలీసు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.