BREAKING
thumb ● జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల వేళ రణరంగం! thumb ● బోయకొండ గంగమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.69.86 లక్షలు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదుపై ఉరుమడ్ల గ్రామ నాయకుల అవగాహన thumb ● చౌటుప్పల్‌లో శ్రీరామ జ్యువెలర్స్‌లో అగ్నిప్రమాదం thumb ● ముఠా గోపాల్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు thumb ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును కలిసిన మల్లేపల్లి రాజేందర్ రెడ్డి thumb ● అలయ్ బలయ్–2026 కార్యక్రమంలో పాల్గొన్న పీఏసీఎస్ చైర్మన్ మల్లేపల్లి బుచ్చిరెడ్డి thumb ● వలిగొండలో నూతన రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి స్థల పరిశీలన thumb ● మృతురాలి కుటుంబానికి బీఎన్ గౌడ్ రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● కొమ్మాయిగూడెంలో లోవోల్టేజ్ సమస్యకు పరిష్కారం thumb ● జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల వేళ రణరంగం! thumb ● బోయకొండ గంగమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.69.86 లక్షలు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదుపై ఉరుమడ్ల గ్రామ నాయకుల అవగాహన thumb ● చౌటుప్పల్‌లో శ్రీరామ జ్యువెలర్స్‌లో అగ్నిప్రమాదం thumb ● ముఠా గోపాల్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు thumb ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును కలిసిన మల్లేపల్లి రాజేందర్ రెడ్డి thumb ● అలయ్ బలయ్–2026 కార్యక్రమంలో పాల్గొన్న పీఏసీఎస్ చైర్మన్ మల్లేపల్లి బుచ్చిరెడ్డి thumb ● వలిగొండలో నూతన రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి స్థల పరిశీలన thumb ● మృతురాలి కుటుంబానికి బీఎన్ గౌడ్ రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● కొమ్మాయిగూడెంలో లోవోల్టేజ్ సమస్యకు పరిష్కారం
Date of Publish : 22 October 2026, 12:00 pm
Posted by : RAMU JAJU

అన్నారం గ్రామంలో వైభవంగా దుర్గామాత శోభాయాత్ర

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Ramu jaju డొంకేశ్వర్ మండల ప్రతినిధి
22 Oct, 2026 - 12:00 PM
140 వీక్షణలు

డప్పు దరువులు, మంగళవాయిద్యాల నడుమ సాగిన ఊరేగింపు

సంప్రదాయ పూజలు, భక్తుల నామస్మరణతో ఆధ్యాత్మిక సందడి

డొంకేశ్వర్ | ఎన్ టుడే న్యూస్: నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం అన్నారం గ్రామంలో దుర్గామాత శోభాయాత్ర భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా వైభవంగా ముగిసింది. మహాశక్తి సేనా మండలి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నవరాత్రి వేడుకల్లో భాగంగా అమ్మవారి ఊరేగింపు గ్రామంలో ఆధ్యాత్మిక శోభను నింపింది. అమ్మవారి దర్శనం కోసం చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ‘జై భవానీ.. జై జగన్మాత’ నామస్మరణతో గ్రామం మార్మోగింది.

డప్పు దరువులు, సంప్రదాయ ఆటపాటలతో సందడి

డప్పు దరువులు, మంగళవాయిద్యాలు, ఆడబిడ్డల సంప్రదాయ ఆటపాటల మధ్య శోభాయాత్ర కొనసాగింది. గ్రామ వీధులన్నీ పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంప్రదాయ పూజలతో అమ్మవారికి ప్రత్యేక ఆరాధన

శోభాయాత్ర సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు, కుంకుమలతో పాటు నిమ్మకాయల నీటిని ఉపయోగించి సంప్రదాయ ఆచారాలను పాటిస్తూ భవానీలు పూజలు చేశారు. ప్రతి కార్యక్రమంలోనూ భక్తిభావం ఉట్టిపడింది.

గ్రామ ప్రజలపై అమ్మవారి కృప ఉండాలని ప్రార్థనలు

మహాశక్తి సేనా మండలి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సంప్రదాయాలకు ప్రాధాన్యమిస్తూ నిర్వహించిన వేడుకలు గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని భక్తులు మనసారా ప్రార్థించారు.