BREAKING
thumb ● స్వర్ణకారుల బంగారు బిహారంగ సభకు హాజరుకావాలి: ప్రభు చారి విజ్ఞప్తి thumb ● పోలింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించిన పులివెందుల ఆర్డీవో చెన్నయ్య thumb ● యర్రిపల్లిలో పులివెందుల వ్యవసాయ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక శిబిరం thumb ● సింహాద్రిపురంలో జోరుగా నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందులలో జోరందుకున్న మున్సిపల్ పోరు నగరిగుట్టలో కూటమి ముమ్మర ప్రచారం! ​ thumb ● తిరుపతి రూరల్ జెడ్పీటీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున కె. జ్యోతీశ్వర్ నాయక్ నామినేషన్ దాఖలు! thumb ● మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గీతా కుమారి తరఫున తూగుట్ల మధు ముమ్మర ప్రచారం thumb ● పులివెందులలో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం జోరు thumb ● వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా పంచామృత అభిషేకం thumb ● జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల వేళ రణరంగం! thumb ● స్వర్ణకారుల బంగారు బిహారంగ సభకు హాజరుకావాలి: ప్రభు చారి విజ్ఞప్తి thumb ● పోలింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించిన పులివెందుల ఆర్డీవో చెన్నయ్య thumb ● యర్రిపల్లిలో పులివెందుల వ్యవసాయ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక శిబిరం thumb ● సింహాద్రిపురంలో జోరుగా నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందులలో జోరందుకున్న మున్సిపల్ పోరు నగరిగుట్టలో కూటమి ముమ్మర ప్రచారం! ​ thumb ● తిరుపతి రూరల్ జెడ్పీటీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున కె. జ్యోతీశ్వర్ నాయక్ నామినేషన్ దాఖలు! thumb ● మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గీతా కుమారి తరఫున తూగుట్ల మధు ముమ్మర ప్రచారం thumb ● పులివెందులలో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం జోరు thumb ● వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా పంచామృత అభిషేకం thumb ● జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల వేళ రణరంగం!
మంచి మాట
Date of Publish : 23 October 2026, 06:58 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి జడ్పీటీసీ అభ్యర్థిగా దుర్గం పుల్లారావు నామినేషన్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Oct, 2026 - 06:58 PM
43 వీక్షణలు

ఏలూరు జిల్లా, చాట్రాయి: చాట్రాయి జడ్పీటీసీ స్థానానికి సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ అభ్యర్థిగా దుర్గం పుల్లారావు, చాట్ల బాబురావు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి. హరినాథ్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వం అణిచివేత ధోరణిని కొనసాగిస్తోందని ఆరోపించారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరుగుతాయా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.

మున్సిపల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు వాయిదా నిర్ణయం తీసుకున్నప్పటికీ ప్రభుత్వం, అధికారుల వైఖరిలో మార్పు కనిపించడం లేదని హరినాథ్ విమర్శించారు. ఎన్నికల ఓటరు జాబితాలు సైతం గందరగోళానికి కారణమవుతున్నాయని అన్నారు. చాట్రాయి మండల ఎన్నికల అధికారి వద్ద ఉన్న ఓటరు జాబితాకు, జిల్లా పరిషత్ కార్యాలయంలో అందుబాటులో ఉన్న ఓటరు జాబితాకు మధ్య పొంతన లేకుండా పోయిందని తెలిపారు. ఈ విషయాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లిన అనంతరం, జిల్లా పరిషత్ కార్యాలయంలోని ఓటరు జాబితాలో పేర్లు, ఓటరు సంఖ్యలను గంటకు పైగా పరిశీలించి ధ్రువీకరించిన తర్వాతే నామినేషన్ పత్రాలను ఆమోదించారని వివరించారు.

ఎన్నికల ప్రక్రియలో ఓటరు జాబితాల మధ్య సమన్వయం లేకపోవడం ప్రభుత్వ వైఫల్యాన్ని తెలియజేస్తోందని ఆయన ఆరోపించారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఉన్నం అనిల్, నల్ల శీను, సుందరం, కలపాల వెంకటేశ్వరరావు, తిరుపతిరావు, నందిపాం ఏసు, హెచ్. రాజేంద్ర ప్రసాద్, నందిపాం కిషోర్ తదితరులు పాల్గొన్నారు.