BREAKING
thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్ thumb ● పులివెందుల పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం thumb ● యామవరం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు thumb ● పులివెందులలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందుల 15వ వార్డుపై అందరి దృష్టి thumb ● తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పోగుల సుతేజ్ thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్ thumb ● పులివెందుల పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం thumb ● యామవరం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు thumb ● పులివెందులలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందుల 15వ వార్డుపై అందరి దృష్టి thumb ● తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పోగుల సుతేజ్ thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్
Date of Publish : 21 October 2026, 04:29 pm
Posted by : PAGADALA DEVAIAH

కర్మన్‌ఘాట్‌లో అంగరంగ వైభవంగా దసరా మహోత్సవాలు

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
21 Oct, 2026 - 04:29 PM
22 వీక్షణలు
  • రామలీలా మైదానంలో ఘనంగా రావణ దహనం
  • ఉత్సవాలకు భారీగా తరలివచ్చిన స్థానిక ప్రజలు
  • కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వేడుకలు
  • సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు

కర్మన్‌ఘాట్ | ఎన్ టుడే న్యూస్: క్రాంతి యువజన సంగం ఆధ్వర్యంలో కర్మన్‌ఘాట్‌లోని రామలీలా మైదానంలో దసరా మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలు, సంప్రదాయ వైభవం నడుమ జరిగిన ఈ వేడుకలకు స్థానిక ప్రజలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు రావణ దహన కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో రామలీలా మైదానం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.

క్రాంతి యువజన సంగం కమిటీ సభ్యులు బండారి కిషోర్ రెడ్డి, సుంకరి రమేష్ గౌడ్, చేగోని విఠల్ గౌడ్, చీర సత్యనారాయణ, గొరిగె బాబు గౌడ్, పాలెం శేఖర్ గౌడ్, చేగోని శ్రీనివాస్ గౌడ్, సూర్వి సాయి గౌడ్, రాచకొండ శ్రీనివాస్, గొరిగె సురేష్, చీర శ్రీనివాస్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

దసరా మహోత్సవాలను విజయవంతం చేసేందుకు సహకరించిన కర్మన్‌ఘాట్ ప్రజలు, భక్తులు, మహిళలు, యువతతో పాటు ప్రతి ఒక్కరికీ క్రాంతి యువజన సంగం కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇలాంటి సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.