మార్కాపురం జిల్లాలో ఎన్నికల కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్
/
మార్కాపురం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదులకు ప్రత్యేక కేంద్రం
మార్కాపురం: జిల్లాలో ఎన్నికల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ విజయ సునీత శనివారం తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలతో పాటు ఎన్నికలకు సంబంధించిన ఇతర సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు.
ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కంట్రోల్ రూమ్ 24 గంటల పాటు పనిచేస్తుందని కలెక్టర్ తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు, సమస్యలను 9248702500 నంబర్కు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.